iDreamPost

ఫ్రీ వాటర్ ఇవ్వని రెస్టారెంట్‌ కు భారీ ఫైన్! మీకు ఇలా జరిగిందా?

భోజనం చేసేందుకు రెస్టారెంట్ కు వెళ్లిన కస్టమర్ కు ఫ్రీగా వాటర్ ఇవ్వకుండా ఛార్జ్ వసూల్ చేసింది ఓ రెస్టారెంట్. దీంతో ఆ రెస్టారెంట్ కు ఊహించని షాక్ తగిలింది. భారీగా ఫైన్ విధించింది వినియోగదారుల కమిషన్.

భోజనం చేసేందుకు రెస్టారెంట్ కు వెళ్లిన కస్టమర్ కు ఫ్రీగా వాటర్ ఇవ్వకుండా ఛార్జ్ వసూల్ చేసింది ఓ రెస్టారెంట్. దీంతో ఆ రెస్టారెంట్ కు ఊహించని షాక్ తగిలింది. భారీగా ఫైన్ విధించింది వినియోగదారుల కమిషన్.

ఫ్రీ వాటర్ ఇవ్వని  రెస్టారెంట్‌ కు భారీ ఫైన్! మీకు ఇలా జరిగిందా?

త్రాగునీటితో బిజినెస్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఇదే తంతు కొనసాగుతోంది. జనాలు కూడా మినరల్ వాటర్, వాటర్ బాటిల్స్ కు అలవాటు పడిపోయారు. ఇదిలా ఉంటే ఇదివరకు రెస్టారెంట్స్ లో ఉచితంగా మంచి నీళ్లను అందించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. రెస్టారెంట్స్ కు భోజనం చేసేందుకు వెళ్లే కస్టమర్లకు ఫ్రీగా వాటర్ అందించకుండా సరికొత్త దందాకు తెరలేపుతున్నారు. లూస్ వాటర్ ను ఇవ్వకుండా.. సీల్ వాటర్ బాటిల్ ను అందించి బిల్ కట్టించుకుంటున్నారు. ఇదే విధంగా కస్టమర్ కు ఫ్రీ వాటర్ ఇవ్వకుండా వ్యవహరించిన రెస్టారెంట్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది జిల్లా వినియోగదారుల కమిషన్. ఏకంగా వేలల్లో ఫైన్ విధించింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పండగలప్పుడు లేదా వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో లేదా ఫ్యామిలీతో కలిసి భోజనం చేసేందుకు రెస్టారెంట్ కు వెళ్తుంటారు. వందలు, వేలు ఖర్చు చేసి ఫుడ్ ఆర్డర్ ఇస్తుంటారు. కానీ రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం కస్టమర్లకు త్రాగే నీటిని మాత్రం ఉచితంగా సరఫరా చేయడం లేదు. తెలంగాణ గవర్నమెంట్ మున్పిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ అన్ని హోటల్ మరియు రెస్టారెంట్లలో కస్టమర్లకు ఉచితంగా వాటర్ అందించాలని 2023 నుంచి నిబంధనలు జారీ చేసింది. కానీ కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు ఈ నిబంధనలేవీ పట్టించుకోకుండా వాటర్ కు కూడా బిల్ వసూల్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్ ఆఫ్ లీటర్ వాటర్ కు రూ.50 ఛార్జ్ చేసినందుకు ఓ కస్టమర్ డిస్ట్రిక్ కన్సూమర్స్ కమిషన్ కు ఆశ్రయించాడు. ఆ హాటల్ కస్టమర్‌కు రూ.5వేల చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది.

సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఓ రెస్టారెంట్ కు భోజనం చేసేందుకు వెళ్లాడు. భోజనం చేసిన అనంతరం తనకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లో నీళ్లు వద్దని, లూస్ వాటర్ ఇవ్వాలని హోటల్ సిబ్బందిని కోరాడు. అయినా రెస్టారెంట్ సిబ్బంది 500 ఎంఎల్ వాటర్ బాటిల్ ఇచ్చి రూ.50 ఛార్జ్ చేశారు. రెస్టారెంట్ నిర్వాకంతో ఖంగుతిన్న కస్టమర్ కన్సూమర్ కమిషన్‌లో కంప్లైంట్ చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల కమిషన్ కస్టమర్‌కు కలిగిన నష్టానికి రూ.5వేలు చెల్లించాలని, లిటిగేషన్ ఫీజు రూ.వేయి కట్టాలని ఆదేశించింది. అంతేకాకుండా వాటర్ బాటిల్ కు తీసుకున్న రూ.50 కస్టమర్ కు తిరిగి ఇవ్వాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఆ రెస్టారెంట్ ను ఆదేశించింది. మరి మీరు కూడా ఇలాంటి ఘటనను ఎదుర్కొన్నారా? మీకు ఎప్పుడైనా ఇలా జరిగినట్లైతే వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించి నష్టపరిహారాన్ని పొందొచ్చు. ఫ్రీ వాటర్ ఇవ్వని రెస్టారెంట్ కు రూ. 5 వేలు జరిమానా విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి