iDreamPost
android-app
ios-app

నేను మాట్లాడితే అందరూ వెక్కిరించేవారు.. అవమానించేవారు: హృతిక్ రోషన్ షాకింగ్ కామెంట్స్

  • Author Soma Sekhar Published - 08:04 PM, Tue - 8 August 23
  • Author Soma Sekhar Published - 08:04 PM, Tue - 8 August 23
నేను మాట్లాడితే అందరూ వెక్కిరించేవారు.. అవమానించేవారు: హృతిక్ రోషన్ షాకింగ్ కామెంట్స్

స్టార్ హీరో అనగానే.. లగ్జరీ లైఫ్, విదేశాల్లో ఎంజాయ్ మెంట్ అని అనుకుంటారు సాధారణ ప్రేక్షకులు. కానీ వారు ఆ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో.. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వారు తమ లైఫ్ లో ఎదుర్కొన్న అవమానాలను బయటపెడతారు. ఈ క్రమంలోనే నేనూ అలాంటి ఎన్నో అవమానాలను ఫేస్ చేశానని, చిన్నతనంలో నేను మాట్లాడుతుంటే అందరూ వెక్కిరించేవారని బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.’కోయ్ మిల్ గయా’ సినిమా వచ్చి నేటికి(ఆగస్టు 8)కి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు ఈ అందగాడు.

హృతిక్ రోషన్.. బాలీవుడ్ అందగాడుగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక అతడితో నటించాలని ఎంతో మంది హీరోయిన్స్ కలలు కంటూఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరో స్టేటస్ ను అనుభవిస్తున్న హృతిక్.. చిన్నతనంలో నేను మాట్లాడుతుంటే అందరూ వెక్కిరించేవారని, అప్పుడు నేను ఎంతో బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు. కోయ్ మిల్ గయా సినిమా వచ్చి నేటికి (ఆగస్టు 8)కి 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అతడు మీడియాతో ముచ్చటించాడు.

” ఈ సినిమా నా కెరీర్ కు ఉపయోగపడుతుందని చేయలేదు. నా మనసుకు నచ్చిచేశాను. ఈ కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇక ఈ సినిమా స్టార్ట్ అయ్యాక ఒక నటుడిగా నేను ఎలా ఉండాలి? ఎలాంటి మూవీలు ఎంచుకోవాలో? తెలుసుకున్నాను. ఇక రోహిత్ పాత్ర నా నిజజీవితానికి దగ్గర ఉంటుంది. స్కూలుకు వెళ్లే రోజుల్లో నాకు నత్తి ఉండేది. దీంతో నేను మాట్లాడితే అందరు నన్ను వెక్కిరించేవారు. అప్పడు నేను చాలా బాధపడ్డాను” అంటూ చెప్పుకొచ్చాడు హృతిక్ రోషన్. నాకు నత్తి ఉండటం వల్ల నేను ఏం మాట్లాడినా ఎగతాళి చేసేవారని తెలిపాడు.

ఇక ఈ సినిమాలో రోహిత్ స్కూటీని ధ్వంసం చేసినట్లుగానే.. నా సైకిల్ ను కొందరు సీనియర్స్ వచ్చి నాశనం చేశారని అతడు ఈ సందర్బంగా వెల్లడించాడు. కాగా.. తన నిజజీవితంలో జరిగిన సంఘటనల వల్లే ఈ సినిమాలో, ఈ సీన్ లో సహజంగా నటించినట్లుగా పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో తొలిసారిగా అలనాటి అందాల తార రేఖ మేడంతో నటించడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ సినిమాలో ఆమె కొట్టిన చెంపదెబ్బ ఇంకా గుర్తుందని హృతిక్ చెప్పుకొచ్చాడు.

ఇదికూడా చదవండి: ధనుష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బ్యూటీని గుర్తుపట్టారా?

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş