iDreamPost

బడా టోర్నీల్లో కీలకంగా మారిన నెట్ రన్ రేట్.. దీన్ని ఎలా లెక్కిస్తారో తెలుసా?

  • Published May 16, 2024 | 10:16 PMUpdated May 16, 2024 | 10:16 PM

ఐసీసీ టోర్నీలతో పాటు ఆసియా కప్, ఐపీఎల్ లాంటి బడా టోర్నమెంట్స్​లో నెట్ రన్​ రేట్ చాలా కీలకంగా మారుతుంది. స్వల్ప తేడాతో జట్ల భవితవ్యమే మారిపోతుంది. అలాంటి నెట్ రన్ రేట్​ను ఎలా లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐసీసీ టోర్నీలతో పాటు ఆసియా కప్, ఐపీఎల్ లాంటి బడా టోర్నమెంట్స్​లో నెట్ రన్​ రేట్ చాలా కీలకంగా మారుతుంది. స్వల్ప తేడాతో జట్ల భవితవ్యమే మారిపోతుంది. అలాంటి నెట్ రన్ రేట్​ను ఎలా లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 16, 2024 | 10:16 PMUpdated May 16, 2024 | 10:16 PM
బడా టోర్నీల్లో కీలకంగా మారిన నెట్ రన్ రేట్.. దీన్ని ఎలా లెక్కిస్తారో తెలుసా?

నెట్ రన్ రేట్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పదం ఇది. ద్వైపాక్షిక సిరీస్​ల్లో దీని ప్రస్తావన రాదు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి బడా టోర్నీలతో పాటు ఆసియా కప్ వంటి టోర్నీల సమయంలో నెట్ రన్ రేట్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఐపీఎల్ లాంటి లీగ్స్ సమయంలోనూ దీని చుట్టూనే డిస్కషన్స్ నడుస్తుంటాయి. నెట్​ రన్​ రేట్​ను బట్టే బడా టోర్నీల్లో జట్ల భవితవ్యం తేలుతుంది. నెట్ రన్​ రేట్​లో ఉండే స్వల్ప తేడాలతో మధ్యలోనే టీమ్స్ ఇంటి బాట పట్టడం చూస్తూనే ఉంటాం. అలాంటి నెట్ రన్ రేట్​ను ఎలా లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

వరల్డ్ కప్ తర్వాత అంతగా నెట్ రన్ రేట్ గురించి డిస్కషన్స్ నడిచేది ఐపీఎల్​లోనే. ప్రపంచ కప్ అయినా ఫార్మాట్​ను బట్టి రెండేళ్లకు ఓసారి, ఐదేళ్లకు ఒకసారి జరుగుతుంది. కానీ క్యాష్ రిచ్ లీగ్ అలా కాదు.. ప్రతి ఏడాది సమ్మర్​లో ఓ సీజన్ జరగాల్సిందే. ఈ టోర్నీలో ప్లేఆఫ్స్ చేరే టీమ్స్​ భవితవ్యం అంతా నెట్ రన్ రేట్ ఆధారంగానే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఏ టీమ్ రన్ రేట్ ఎంత ఉందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్ రన్ రేట్​ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.. ఏదైనా టోర్నీలో ఒక జట్టు ఎన్ని ఓవర్లలో ఎన్ని పరుగులు చేసిందనే దాంట్లో నుంచి అదే జట్టు బౌలింగ్ సమయంలో ఎన్ని ఓవర్లలో ఎన్ని పరుగులు ఇచ్చుకుందో దాన్ని మైనస్ చేస్తే నెట్ రన్ రేట్ ఎంతో వచ్చేస్తుంది.

ఉదాహరణకు ఈ ఐపీఎల్​లో సీఎస్​కే జట్టు ఇప్పటిదాకా 254.4 ఓవర్లు ఆడి 2333 పరుగులు చేసింది. ఓవర్లను రన్స్​తో భాగించాలి. అప్పుడు 9.160గా వచ్చింది. అయితే మరింత కచ్చితత్వం కోసం సీఎస్​కే ఆడిన ఓవర్లలో ఆ నాలుగు బంతుల్ని ఆరుగా తీసుకొని లెక్కించాం. అప్పుడు అది 0.67తో సమానం. కాబట్టి 2333/254.67 భాగించాం. అప్పుడు 9.160గా వచ్చింది. అదే జట్టు బౌలింగ్ టైమ్​లో 254.3 ఓవర్లు వేసి 2197 పరుగులు చేసింది. ఇక్కడ కూడా ఆఖరి మూడు బంతుల్ని ఆరు బంతులకు సమానంగా తీసుకుంటే 0.50గా వచ్చింది. ఆ తర్వాత 2197/254.50 భాగించాం. అప్పుడు 8.632గా వచ్చింది. ఇప్పుడు 9.160లో నుంచి 8.632ను తీసివేస్తే 0.582 వచ్చింది. ఇదే సీఎస్​కే నెట్ రన్​ రేట్. భాగించడం, తీసివేయడం తెలిస్తే చాలు ఈజీగా నెట్ రన్ రేట్​ను క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక, ఏదైనా టోర్నీలో రెండు జట్ల పాయింట్స్ సమానంగా ఉన్నప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగానే ఏ టీమ్ క్వాలిఫై అవుతుందనేది నిర్ణయిస్తారనేది తెలిసిందే. మరి.. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా నెట్ రన్ రేట్ లెక్కించినట్లయితే కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Silly_Kunnu1405 (@silly_kunnu)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి