iDreamPost

బోరుబావిలో బాలుడు.. నాలుగున్నర రోజులు రెస్క్యూ చేసి..

బోరుబావిలో బాలుడు.. నాలుగున్నర రోజులు రెస్క్యూ చేసి..

ఛత్తీస్ ఘడ్ లో ఓ బాలుడు నాలుగున్నర రోజుల క్రితం బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 110 గంటలు బోరుబావిలోనే ఉన్న బాలుడిని రక్షణ సిబ్బంది, అధికారులు నిర్విరామంగా శ్రమించి.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఛత్తీస్ ఘడ్ లోని పిహ్రిద్ గ్రామానికి చెందిన రాహుల్ సాహు (11) అనే బాలుడు శుక్రవారం (జూన్ 10) సాయంత్రం బోరుబావిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అధికార యంత్రాంగం రక్షణ చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు అధికారులు బాలుడిని రక్షించేందుకు కావాల్సినవన్నీ తీసుకొచ్చారు.

బోరుబావిలో పడిన బాలుడి పరిస్థితిని గురించి ఎప్పటికప్పుడు ఆరా తీశారు. 80 అడుగుల లోతున్న బోరుబావిలో బాలుడు దాదాపు 70 అడుగల లోతున పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఆర్మీ, పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపు 110 గంటలపాటు శ్రమించి.. బోరుబావికి సమానంగా బాలుడు పడిపోయిన చోటుకి మరో టన్నెల్ ను తవ్వి బాలుడిని రక్షించారు. మంగళవారం సాయంత్రం బాలుడిని బయటకు తీసుకురాగా.. అతని నుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో అధికారులు ఆందోళన చెందారు. తర్వాత ఆహారం కోసం మెల్లగా స్పందించడంతో హర్షం వ్యక్తం చేశారు. బాలుడిని రక్షించేందుకు 500 మంది సిబ్బంది పనిచేశారు. రాహుల్ సాహు బోరుబావి నుంచి సురక్షితంగా బయటపడటంపై చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బఘెల్ హర్షం వ్యక్తం చేశారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి