iDreamPost

ఒకేసారి రెండు దేశాల్లో హనీమూన్.. రెండు దేశాల సరిహద్దులని కవర్ చేసిన బెడ్..

ఒకేసారి రెండు దేశాల్లో హనీమూన్.. రెండు దేశాల సరిహద్దులని కవర్ చేసిన బెడ్..

కొన్ని దేశాల మధ్య సరిహద్దులు చాలా ప్రశాంతంగా, అందంగా ఉంటాయి. కొన్ని కొన్ని ఊర్లు రెండు దేశాలలోను ఉంటాయి. అలాంటి ఒక ఊరు ఫ్రాన్స్, స్విట్జ‌ర్లాండ్ దేశాల మధ్యలో ఉంది. ఒక‌ప్పుడు లా క్యూర్ అనే ఈ గ్రామం స్విట్జ‌ర్లాండ్లో ఉండేది. చాలాసార్లు ఫ్రాన్స్ ఈ ఊరిని స్వాధీనం చేసుకోవాలని అనుకుంది. కుదరకపోవడంతో స్విట్జ‌ర్లాండ్ కి వేరే ప్రాంతం ఇచ్చి, ఈ ఊరిలో సగం, ఫ్రాన్స్ తీసుకుంది. దీంతో ఫ్రాన్స్, స్విట్జ‌ర్లాండ్ సరిహద్దు ఈ ఊరి మధ్యగా వెళ్తుంది. ఓ వ్యాపారవేత్త రెండు దేశాల్లో సగం సగం ఉండేలా ఓ ఇంటిని నిర్మించాడు. అత‌నికి వేరే ప్లాన్స్ ఉన్నాయి.

కొన్నేళ్ల‌ తర్వాత ఈ ఇంటిని అమ్మేస్తే, దీనిని హోటల్ గా మార్చారు. ఈ ఇంటిని కొన్న వ్యక్తి పేరు మీదే ఆర్బేజ్ హోటల్ గా పేరు పెట్టారు. ఈ హోటల్ సగం ఫ్రాన్స్, సగం స్విట్జ‌ర్లాండ్ లో ఉండటంతో బాగా పేరొచ్చింది. ఈ హోటల్ లో కొన్ని రూమ్స్ కూడా సగం ఫ్రాన్స్, సగం స్విట్జ‌ర్లాండ్ లో ఉంటాయి. ఇలా రెండు దేశాలని పంచుకోవడంతో ఆర్బేజ్ హోటల్ ఓ టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయింది.

ఈ హోటల్ కి మరింత ఫేమ్ తీసుకురావడానికి, ఓ రూమ్ లో రెండు దేశాల్లో ఉండేలాగా ఓ బెడ్ ని వేసి ఒకేసారి రెండు దేశాల్లో హనీమూన్ చేసుకోవచ్చు అని ఆఫర్ పెట్టారు. అంతే, ఈ హోటల్ బాగా ఫేమస్ అయిపోయింది. ఆ బెడ్ మీద పడుకుంటే, ఒకేసారి ఫ్రాన్స్, స్విట్జ‌ర్లాండ్ లో ఉన్నట్టే. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆ బెడ్ మీద ఒక వైపు ఫ్రాన్స్ జెండా ఉన్న దిండు, మరో వైపు స్విట్జ‌ర్లాండ్ జెండా ఉన్న దిండు వేశారు. అందుకే జంటలు ఒకేసారి రెండు దేశాల్లో హనీమూన్ చేసుకోవడానికి వస్తున్నారు.

ఈ హోటల్ లో ఇలాంటి వింతలు ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో ఉన్న బార్ ఫ్రాన్స్ లో ఉంటే దాని ఎంట్ర‌న్స్ డోర్‌ మాత్రం స్విట్జ‌ర్లాండ్‌లో ఉంది. బిల్డింగ్‌లోని మెట్ల‌లో స‌గం ఒక దేశంలో ఉంటే మిగిలిన స‌గం ఇంకో దేశంలో ఉన్నాయి. ఒక రూంలో అయితే గ‌ది మొత్తం స్విట్జ‌ర్లాండ్‌లో ఉంటే బాత్‌రూమ్ ఫ్రాన్స్‌లో ఉంది. ఇలా ఈ హోటల్ లో సగం సగం రెండు దేశాలు పంచుకున్నాయి. ఈ హోట‌ల్ అడ్ర‌స్‌ రెండు దేశాలలోను ఉంది. ఈ హోటల్ మేనేజ్మెంట్ ట్యాక్స్ ని రెండు దేశాలకి కడుతుంది. మరి మీరు కూడా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి