iDreamPost

ఈ యాంకర్ ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా..?

ఈ యాంకర్ ఎవరో గుర్తు పట్టారా..? ఇప్పుడో స్టార్ హీరోయిన్. ఒక్క మూవీతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా..?

ఈ యాంకర్ ఎవరో గుర్తు పట్టారా..? ఇప్పుడో స్టార్ హీరోయిన్. ఒక్క మూవీతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా..?

ఈ యాంకర్ ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా..?

హీరోయిన్స్ సినిమా సినిమాకు ట్రాన్స్ ఫామ్ అవుతూ ఉంటారు. తొలి నాళ్లలో అందచందాలను ఒలకబోస్తూ.. కాస్త నాజుగ్గా కనిపించే ముద్దుగుమ్మలు.. ఆ తర్వాత బొద్దుగా మారుతూ ఉంటారు. అదీ హర్మోన్ ఇన్ బాలెన్సో, మరో ఇతర కారణాలు తెలియదు కానీ..మొత్తానికి ఫస్ట్ మూవీకీ, ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో తేడా కనిపిస్తూ ఉంటుంది. కోలీవుడ్‌లో ఒకలా, మాలీవుడ్‌లో మరోలా.. ఇక తెలుగు సినిమాల్లో ఇంకోలా కనిపిస్తూ ఉంటారు. మరో పరిశ్రమకు వెళ్లి నాలుగైదు చిత్రాలు చేసి.. తిరిగి టీటౌన్ వచ్చేసరికి గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న యాంకర్‌గా ఫోజు కొడుతున్న అమ్మాయిని చూశారు కదా ఎవరో గుర్తు పట్టారా..

కెరీర్ తొలి నాళ్లలో టాలీవుడ్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత తన సొంత ఇండస్ట్రీకి వెళ్లి.. అక్కడో సత్తా చాటింది. అక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ చూశాక.. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు నాట అడుగుపెట్టింది. ఓ సీనియర్ హీరో సరసన జతకట్టింది. తెలుగు ప్రేక్షకులను అప్పట్లో ఆకట్టుకోలేకపోయినా.. ఇప్పుడు అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు ఆడియన్స్. చెప్పాలంటే.. అప్పటి కంటే.. ఇప్పుడు ఆమె బ్యూటీ రెండింతలు రెట్టింపు అయ్యింది. ఇంతకు ఈ యాంకర్ ఎవరంటే.. మలయాళ బొద్దుగుమ్మ హనీ రోజ్. వీర సింహారెడ్డిలో బాలకృష్ణ సరసన ఆడిపాడి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మదిని దోచేసింది అమ్మడు. ఈ ఫోటోలో యాంకర్‌గా కనిపిస్తున్నది హనీరోజే. అదీ కూడా ఓ తెలుగు మూవీలోనిదే.

2005లో మలయాళంలో బాయ్ ఫ్రెండ్ అనే చిత్రంతో మొహానికి మేకప్ వేసుకున్న ఈ నవ్వుల చందం.. 2008లో తెలుగులోకి అడుగుపెట్టింది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు, ప్రముఖ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో వచ్చిన ఆలయం అనే చిత్రంలో హీరోయిన్‌గా మెరిసింది. ఇందులో హీరో శివాజీ. హీరోయిన్ మన హనీనే. ఆ సినిమాలోనిదే ఈ పిక్. ఈ పిక్చర్ తర్వాత దరిదాపుల కూడా కనిపించలేదు అమ్మడు. తెలుగు తప్ప కన్నడ, తమిళ్, మలయాళ ఇండస్ట్రీల్లో పనిచేసుకుంటూ వెళ్లిపోయింది. మళ్లీ 2023లో వీర సింహారెడ్డితో రీ ఎంట్రీ ఇచ్చింది. ‘ నా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’ అంటూ యూత్ ను తన ఎక్స్ ప్రెషన్స్‌తో కవ్వించేసిన సంగతి విదితమే. ఈ సినిమాతో ఆమె తెలుగులో వరుస సినిమాలు క్యూ కడుతాయి అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మూవీ అప్డేట్ లేదు. రాచేల్, తేరీ మేరీ మూవీలు షూటింగ్ దశలో ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి