iDreamPost
android-app
ios-app

Kantara Chapter-1: రిషబ్ శెట్టి భారీ స్కెచ్.. కాంతార 1 కోసం ఆ హాలీవుడ్ టీమ్ ను దించేశాడట!

  • Published Jun 12, 2024 | 9:07 AM Updated Updated Jun 12, 2024 | 9:07 AM

కాంతార చాప్టర్ 1 కోసం మేకర్స్ భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ కోసం హాలీవుడ్ లో విజయవంతమైన చిత్రాలకు గ్రాఫిక్స్ అందించిన సంస్థతో చేతులు కలిపినట్లు సమాాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కాంతార చాప్టర్ 1 కోసం మేకర్స్ భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ కోసం హాలీవుడ్ లో విజయవంతమైన చిత్రాలకు గ్రాఫిక్స్ అందించిన సంస్థతో చేతులు కలిపినట్లు సమాాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jun 12, 2024 | 9:07 AMUpdated Jun 12, 2024 | 9:07 AM
Kantara Chapter-1: రిషబ్ శెట్టి భారీ స్కెచ్.. కాంతార 1 కోసం ఆ హాలీవుడ్ టీమ్ ను దించేశాడట!

‘కాంతార’.. చిన్న చిత్రంగా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి.. స్వయంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లను కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ సిద్ధమవుతోంది. ‘కాంతార చాప్టర్ 1’ పేరుతో సెట్స్ పైకి వెళ్తున్న ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఈసారి భారీ గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారట. అందుకోసం ఓ భారీ స్కెచ్ నే వేశాడు రిషబ్ శెట్టి. వీఎఫ్ఎక్స్ కోసం ఏకంగా ఆ హాలీవుడ్ టీమ్ నే దించుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

‘కాంతార చాప్టర్ 1’ భారీ హంగులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. కాంతార కంటే ఎక్కువ గ్రాఫిక్స్ ఇందులో ఉంటుందని సమాచారం. అందుకోసం మేకర్స్ వీఎఫ్ఎక్స్ కోసం ఏకంగా హాలీవుడ్ టీమ్ తో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా, ది లయన్ కింగ్, బాట్ మ్యాన్’ లాంటి విజయవంతమైన హాలీవుడ్ చిత్రాలకు గ్రాఫిక్స్ ను అందించిన సంస్థ ఈ చిత్రానికి పనిచేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇందుకు సంబంధించిన పనులు యూకే, యూఎస్ దేశాల్లో జరుగుతున్నాయట.

ఇక షూటింగ్ విషయానికి వస్తే.. కుందాపురం ప్రాంతంలో వేసిన భారీ సెట్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి కళరిపయట్టు, గుర్రపు స్వారీలో కఠిన శిక్షణ తీసుకున్నాడు. కాంతార సాధించిన భారీ విజయంతో మేకర్స్ లో సైతం రెట్టించిన ఉత్సాహం వచ్చింది. దాంతో పార్ట్ 1పై ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనకాడటం లేదు. మరింత క్వాలిటీగా వీఎఫ్ఎక్స్ ను ప్రేక్షకులకు చూపించాలని టీమ్ భావిస్తోంది. అందుకే ఆ హాలీవుడ్ సంస్థతో చేతులు కలిపింది. కాగా.. ఈ చిత్రానికి సంగీతం అజనీష్ లోక్ నాథ్ అందిస్తుండగా.. కెమెరామెన్ గా అరవింద్ కశ్యప్ పనిచేస్తున్నాడు. మరి కాంతార పార్ట్ 1 కోసం హాలీవుడ్ టీమ్ ను దించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş