iDreamPost
android-app
ios-app

అనిత ఓ అనిత బ్రేకప్ సాంగ్ అంటారు.. కానీ, ఆ దర్శకుడి కాపురాన్ని నిలబెట్టింది!

  • Published Jun 11, 2024 | 7:54 PM Updated Updated Jun 11, 2024 | 7:54 PM

Anitha O Anitha Song Writer Nagaraju Revealed A Secret: అనితా ఓ అనితా సాంగ్ మీకు గుర్తుందా? ఆ రోజుల్లో ఓ ఊపు ఊపేసిన బ్రేకప్ సాంగ్. ఆ పాటను మీరు కూడా బ్రేకప్ సాంగ్ అనే అనుకుంటున్నారా? అయితే ఆ దర్శకుడి జీవితాన్ని నిలబెట్టింది ఆ పాట.

Anitha O Anitha Song Writer Nagaraju Revealed A Secret: అనితా ఓ అనితా సాంగ్ మీకు గుర్తుందా? ఆ రోజుల్లో ఓ ఊపు ఊపేసిన బ్రేకప్ సాంగ్. ఆ పాటను మీరు కూడా బ్రేకప్ సాంగ్ అనే అనుకుంటున్నారా? అయితే ఆ దర్శకుడి జీవితాన్ని నిలబెట్టింది ఆ పాట.

  • Published Jun 11, 2024 | 7:54 PMUpdated Jun 11, 2024 | 7:54 PM
అనిత ఓ అనిత బ్రేకప్ సాంగ్ అంటారు.. కానీ, ఆ దర్శకుడి కాపురాన్ని నిలబెట్టింది!

మీరు 90స్ కిడ్స్ అయితే మీరు ఒక పాట పదే పదే విని ఉంటారు. అదే “నా ప్రాణమా.. నను వీడిపోకుమా.. నీ ప్రేమలో నను కరుగనీకుమా. పదే పదే నా మనసే నినే కలవరిస్తోంది.. అనితా ఓ అనితా” అనే పాటను మీరు కచ్చితంగా విని ఉంటారు. ఈ పాట అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఈ పాటలేని ఫోన్ లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు ఆ రోజుల్లో కుర్రాళ్లు బ్రేకప్ అయితే పొద్దున లేస్తే ఇదే పాట పెట్టుకుని వింటూ ఉండేవాళ్లు. అందుకే ఈ పాటకు బ్రేకప్ సాంగ్ అనే ముద్ర కూడా పడిపోయింది. అయితే ఈ పాట ఒక దర్శకుడి కాపురాన్ని నిలబెట్టిందని.. అతని జీవితంలో నవ్వులు పూయించిందని మీకు తెలుసా? ఆ విషయాన్ని స్వయంగా నాగరాజే వెల్లడించాడు.

అనితా ఓ అనితా అనే పాటకు బ్రేకప్ సాంగ్ అనే ముద్ర ఆటోమేటిక్ గానే వచ్చేసింది. అది ఎవరూ వేసింది కాదు. కానీ, ఆ పాట ఇద్దరి జీవితాలను నిలబెట్టింది అనే విషయం మాత్రం ఎవరికీ తెలీదు. నిజానికి ఆ సాంగ్ రైటర్ నాగరాజుకు కూడా రీసెంట్ గానే తెలిసంది. ఆ విషయాన్ని ఒక వీడియో రూపంలో వెల్లడించాడు. ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్న నాగరాజు ఓ దర్శకుడు తనతో పంచుకున్న ఆ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. ఓ సెల్ఫీ వీడియో ద్వారా దర్శకుడు చెప్పిన ఆ ఎమోషనల్ మాటలను తన అభిమానులతో పంచుకున్నాడు. నిజంగా ఆ మాటుల వింటే మీరు కూడా ఎమోషనల్ అయిపోతారు.

“నేను ఓ సాంగ్ రాయడానికి ఓ సినిమా ఆఫీస్ కి వెళ్లాను. అక్కడున్న డైరెక్టర్ నాతో అన్న మాటలకు నేనైతే షాక్ కు గురయ్యాను. ఎందుకంటే నా అనిత సాంగ్ వచ్చిన ఆ సమయంలో నా పాట వల్ల ఆయన తన భార్యతో కలిశాడు. ఆ దర్శకుడి భార్య పేరు కూడా అనిత. వాళ్లిద్దరూ మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారి మధ్య చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం జరిగింది. అలాంటి సమయంలో నేను రాసిన అనితా సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆమె పేరు కూడా అనిత కావడంతో తన భర్తే ఆ పాటను తనకోసం పాడితే ఎలా ఉంటుంది అనుకున్నారు. అందుకే ఆయనకు దూరం కాకుండా విడిపోవాలి అనే ఆలోచన విరమించుకున్నారు. వాళ్లకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. ఎంతో సంతోషంగా ఉన్నారు” అంటూ నాగరాజు వెల్లడించాడు.

అయితే అనిత ఓ అనిత సాంగ్ అంత సెన్సేషన్ అయినా కూడా అప్పట్లే నాగరాజుకు ఎలాంటి అవకాశాలు రాలేదు. కానీ, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ని కాస్త జోరుగానే కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. తన కొత్తపాట కూడా ఒకటి విడుదల కాబోతోంది. అలాగే ఎవరికైనా పాట కావాలి అంటే తనని సంప్రదించాలి అంటూ వ్యాఖ్యానించాడు. మొత్తానికి అనితా ఓ అనితా బ్రేకప్ సాంగ్ కాదని.. అది ఒక కాపురాన్ని నిలబెట్టింది అనే విషయం తెలుసుకుని ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anitha Nagaraju (@anitha_nagaraju_offical)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş