iDreamPost

ఆ కారణంతోనే రాజ్ తరుణ్‌తో సినిమాలు చేయడం లేదు: చాందినీ చౌదరి

  • Published Jun 10, 2024 | 5:57 PMUpdated Jun 10, 2024 | 5:57 PM

సినీ ఇండస్ట్రీలో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నా వారు చాలామంది ఉన్నారు. కాగా, వారిలో టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి, యంగ్ హీరో రాజ్ తరుణ్ ఒకరు. అయితే వీరిద్దరు సినిమాల్లోకి రాకముందు కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. కానీ, బిగ్ స్క్రీన్ మీద మాత్రం ఇంతవరకూ కలిసి నటించలేదు. అయితే ఈ విషయం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మాడు రాజ్ తరుణ్ తో ఎందుకు నటించడం లేదో కారణాలను తెలిపింది.

సినీ ఇండస్ట్రీలో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నా వారు చాలామంది ఉన్నారు. కాగా, వారిలో టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి, యంగ్ హీరో రాజ్ తరుణ్ ఒకరు. అయితే వీరిద్దరు సినిమాల్లోకి రాకముందు కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. కానీ, బిగ్ స్క్రీన్ మీద మాత్రం ఇంతవరకూ కలిసి నటించలేదు. అయితే ఈ విషయం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మాడు రాజ్ తరుణ్ తో ఎందుకు నటించడం లేదో కారణాలను తెలిపింది.

  • Published Jun 10, 2024 | 5:57 PMUpdated Jun 10, 2024 | 5:57 PM
ఆ కారణంతోనే రాజ్ తరుణ్‌తో సినిమాలు చేయడం లేదు: చాందినీ చౌదరి

‘చాందిని చౌదరి’.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ అమ్మాడు నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా దూసుకుపోతుంది. అయితే ఈమె మొదటగా తెలుగులో కేటుగాడు, కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జి వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత హీరో సుహాస్ సరసన కలర్ ఫోటో సినిమాలో అలరించి మంచి సక్సెస్ ను అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఈమె అందం,నటనతో యూత్ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస ఆఫర్స్ అందుకుంటున్న తెలుగమ్మాయి చాందిని ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో మంచి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మాడు రాజ్ తరుణ్ తో ఎందుకు నటించడం లేదో కారణాలను తెలిపింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సినీ ఇండస్ట్రీలో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నా వారు చాలామంది ఉన్నారు. కాగా, వారిలో టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి, యంగ్ హీరో రాజ్ తరుణ్ ఒకరు. అయితే వీరిద్దరు సినిమాల్లోకి రాకముందు కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి యూట్యూబ్ లో వచ్చిన ‘ట్రూ లవ్’, ‘ది బ్లైండ్ డేట్’, ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’, ‘అప్రోచ్’, ‘ప్రపోజల్’, ‘సాంబార్ ఇడ్లీ’ లాంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. ఇక ఈ షార్ట్ ఫిలిమ్స్ వీరికి మంచి పేరును తెచ్చిపెట్టాయి. అయితే స్మాల్ స్క్రీన్ ను పంచుకున్న ఈ జంట, బిగ్ స్క్రీన్ మీద ఇంతవరకూ కలిసి నటించకపోవడానికి కారణమేమిట అని చాలాకాలంగా చర్చంశనీయంగా మారింది. ఇక ఈ విషయం పై తాజాగా చాందిని ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. అలాగే రాజ్ తరుణ్ తో కలిసి సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను తెలిపింది.

ఈ సందర్భంగా హీరోయిన్ చాందినీకి రాజ్ తరుణ్‌తో చాలా హిట్ షార్ట్ ఫిలిమ్స్ చేశారు కదా, అవకాశం వస్తే బిగ్ స్క్రీన్ మీద కలిసి నటించాలని ఎప్పుడూ అనుకోలేదా?’’ అని యాంకర్ ప్రశ్న ఎదురవ్వగా.. అందుకు చాందినీ ఇలా స్పందించింది. ‘అయ్యో రాజ్ తరుణ్‌తో కలిసి చేయడానికి మాకు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలు నేను చెయ్యలేకపోయాను అని చాందిని చెప్పింది.  పైగా  ఆయన హీరోగా నటించిన మొదటి మూడు చిత్రాల్లో హీరోయిన్ అవకాశాలు ముందుగా నాకే వచ్చాయి. కానీ, దురదృష్టవశాత్తు నేను వాటిల్లో నటించలేకపోయాను. అప్పటి నుంచి ఇద్దరం వేర్వేరు దారుల్లో సినిమాలు చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత కలిసి నటించడానికి అవకాశం రాలేదు. అయినా మేమిద్దరం ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాం’ అని చాందినీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చాందినీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రస్తుతం ఈ అమ్మాడు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. వాటిలో పోలీసాఫీసర్ పాత్ర పోషించిన ‘యేవమ్’ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది.  కాగా, ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘సంతాన ప్రాప్తిరస్తు’ వంటి సినిమాల్లో చాందిని లీడ్ రోల్స్ చేస్తోంది. మరి, చాందిని, రాజ్ తరుణ్ తో సినిమాలు చేయకపోవడానికి కారణంపై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి