iDreamPost

కుప్పకూలిన హెలికాప్టర్‌.. బ్యాంక్‌ CEO సహా ఆరుగురు మృతి!

Helicopter Crashed: ప్రమాదాలు అనేవి ఎప్పుడు ఎలా ముంచుకు వస్తాయో ఎవరూ ఊహించలేను.. హెలికాప్టర్ కుప్పకూలి బ్యాంకు సీఈఓ కుటుంబం దుర్మరణం పాలయ్యారు.

Helicopter Crashed: ప్రమాదాలు అనేవి ఎప్పుడు ఎలా ముంచుకు వస్తాయో ఎవరూ ఊహించలేను.. హెలికాప్టర్ కుప్పకూలి బ్యాంకు సీఈఓ కుటుంబం దుర్మరణం పాలయ్యారు.

కుప్పకూలిన హెలికాప్టర్‌.. బ్యాంక్‌ CEO సహా ఆరుగురు మృతి!

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసర పనులు వేగంగా పూర్తి చేయాలంటే చాలా వరకు విమాన ప్రయాణాలకు ఎక్కువ ప్రాముఖ్యతా ఇస్తుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించవొచ్చు. కానీ ఇటీవల విమాన ప్రయాణాలు అంటే భయపడే పరిస్తితి నెలకొంది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం, ఇంజన్ లో మంటలు రావడం,  హఠాత్తుగా వాతావరణంలో మార్పురావడం, పక్షు ఢీకొట్టడం, ల్యాండింగ్ సమయంలో వీల్స్ కి ప్రమాదం జరగడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి..  ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పైలట్లు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి వెంటనే సెఫ్టీ ల్యాండింగ్ చేయడం వల్ల చాలా వరకు ప్రయాణికులు ప్రాణాలు కాపాడగలుగుతున్నారు. తాజాగా ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయి.. బ్యాంక్ సీఈఓ కన్నుమూశారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని కాలిఫోర్నియాలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. నైజీరియాకు చెందిన అతి పెద్ద బ్యాంక్ సీఈఓ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని కాలిఫోర్నియా-నెవడా సరిహద్దులో ఈ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిపోయిందని అధికారులు అంటున్నారు. శుక్రవారం రాత్రి పది గంటల ప్రాంతంలతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. నైజీరియాకు చెందిన యాక్సెస్ బ్యాంక్ సీఈఓ హెర్డర్ట్ విగ్వే తన భార్య, కుమారుడు, మరికొందితో కలిసి యూరోకాప్టర్ ఈసీ 130లో మొజువా ఎడారి పై ప్రయాణిస్తున్నారు. హఠాత్తుగా టెక్నికల్ ఇబ్బంది తలెత్తి శాన్ బ్రెనార్డివో కౌంటీ వద్ద హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దాదాపు మూడు వేల అడుగుల ఎత్తు నుంచి ఇది కులిపోవడంతో పెద్దగా మంటలు చెలరేగి అందులో ఉన్నవారంతా కన్నుమూశారు.

ఈ దుర్ఘటన గురించి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ నోజీ ఒకాంజో ధృవీకరించారు. బ్యాంక్ సీఈఓ హెర్బర్ట్ విగ్వే.. ఆఫ్రికా బ్యాంకింగ్ రంగానికి పెద్ద షాక్ అని.. మృతుల్లో నైజీరియాకు చెందిన ఎన్‌జీఎక్స్ గ్రూప్ చైర్మన్ అబింబోలా, ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారని.. ఇది చాలా బాధాకరమైన సంఘటన అంటూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేసన్ జనరల్ ఎలావా సోషల్ మాద్యం ద్వారా సంతాపాన్ని తెలిపారు. ప్రస్తుతం నైజీరియా యాక్సెస్ బ్యాంకు ఆఫ్రికాలోని పలు దేశాలకు తమ సేవలను అందిస్తుంది. హెలికాప్టర్ కూలిన సమయంలో అక్కడ తీవ్రంగా మంచు కురుస్తున్నట్లు సమాచారం.మరోవైపు ప్రమాదం ఘటనపై ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేపట్టింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి