iDreamPost

హైదరాబాద్ పై విరుచుకుపడ్డ వరుణుడు! ఒక్కసారిగా కుండపోత వర్షం!

Heavy Rain In Hyderabad And Telugu States: హైదరాబాద్ నగరవాసులకు చల్లని కబురు అందింది.. నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

Heavy Rain In Hyderabad And Telugu States: హైదరాబాద్ నగరవాసులకు చల్లని కబురు అందింది.. నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

హైదరాబాద్ పై విరుచుకుపడ్డ వరుణుడు! ఒక్కసారిగా కుండపోత వర్షం!

గత కొన్ని రోజులుగా ఉక్కపోత, భానుడి భగభగలకు హైదారాబాద్ నగర వాసులు మాడిపోయారు. అసలు ఏంటి ఈ ఎండలు అంటూ అంతా తలలు పట్టుకుంటున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు. అలాంటి వారికి ఇప్పుడు చల్లని కబురు అందింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపై వరుణుడు దయ దలిచినట్లుగా ఉన్నాడు. ఇప్పటికే ఉదయం నుంచి ఏపీలో అక్కడక్కడా వర్షం పడుతుంటే.. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని  పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వరుణుడు విరుచకుపడడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

హైదరాబాద్ నగర వాసులు గత కొన్ని రోజులుగా ఎండలకు, ఉక్కపోతకు అల్లాడిపోయారు. అలాంటిది నగరవాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో చెదురుమొదురు వానలు కురుస్తాయని చెప్పారు. వాతావరణ శాఖ అలా చెప్పిందో లేదో.. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సిటీలో ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. చల్లని గాలులు వీచాయి. ఈదురుగాలులకు అక్కడక్కడ చెట్లు కూడా విరిగిపడ్డాయి. హైదరాబాద్ లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటైన లింగంపల్లి రైల్వే స్టేషన్లో ట్రాక్ పై చెట్టు విరిగి పడడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల మీదకు వర్షపు నీరు వచ్చి చేరింది. వాహనదారులు కాస్త ఇబ్బందులకు గురవుతున్నారు.

హైదరాబాద్ లోని మియాపూర్ లో వడగళ్లతో కూడిన వర్షం కురుస్తోంది. చందానగర్, కుత్భుల్లాపూర్, నిజాంపేట్, కూకట్ పల్లి, ఖైతల్లాపూర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్ పల్లి, పేట్ బషీరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నిన్నమొన్నటి వరకు 46 డిగ్రీల వరకు నమోదు అయిన ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. రాష్ట్ర ప్రజలు కూడా వరుణుడు దయ దలిచాడు అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ చెప్పిన దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో మే 7 నుంచి దాదాపు ఐదు రోజులు వర్షం కురుస్తుంది. అధికారులు చెప్పిన విధంగా 7నే వర్షం రావడంతో.. ఇంకో ఐదురోజులు వర్షం కురుస్తుందని రాష్ట్ర ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు నగరవాసులను హెచ్చరిస్తున్నారు. రోడ్లమీద వర్షపు నీరు ఉన్నట్లు జాగ్రత్త వహించాలని తెలియజేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి