iDreamPost

తెలంగాణలో భారీ వర్షాలు.. ఇంకెన్ని రోజులంటే?

  • Published Nov 24, 2023 | 12:18 PMUpdated Nov 24, 2023 | 12:18 PM

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు

  • Published Nov 24, 2023 | 12:18 PMUpdated Nov 24, 2023 | 12:18 PM
తెలంగాణలో భారీ వర్షాలు.. ఇంకెన్ని రోజులంటే?

తెలంగాణ లో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తణ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి జల్లులు పడే ఛాన్సు ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమైన ఉండటం వల్ల ఉదయం పూట పొగమంచు కమ్మేస్తుందని, వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగ ఉండాలని, గ్రామాల్లో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో నిన్నటి నుంచి వాతావరణం ఒక్కసారే మారిపోయింది. గురువారం నుంచి పలు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో సైతం కొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి విపరీతమైన గాలులు తెలంగాణ వైపు వీస్తున్నట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 0.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. నల్లగొండ జిల్లా దామరచర్ల లో అత్యధికంగా 27.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఖమ్మం జిల్లా నాగులవంచలో 2.7 సెంటీమీటర్లు, సూర్యపేట జిల్లాలోని నడిగూడెంలో 2.5, రెడ్డి గూడలో 2.2, అర్వపల్లిలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయ్యింది. మెదక్ లో అత్యల్పంగా 17 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రామగుండంలో గరిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.

వర్షాల కారణంగా వాతావరణం మరింత చల్లబడే అవకాశం ఉందని.. ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని.. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచే చిరు జల్లులు పడ్డాయి. అమీర్ పేట్, కూకట్ పల్లి, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, ఫిలిం నగర్, లక్డీకాపూల్, అబిడ్స్, రామాంతపూర్, తర్నాక,ఎర్రగడ్డ, మెహదీపట్నం, ఉప్పల్, సికింద్రాబాద్ తో పాలు ఇతర ప్రాంతాల్లో వర్షం పడింది. తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులు వర్షాలు ఉండబోతున్నాయని.. వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్ష సూచన ఉండటం తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పనులైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి