iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో భారీ వర్షం.. నేరుగా ప్లే ఆఫ్స్ కి SRH!

SRH vs GT- Heavy Rain In Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు వరుణ దేవుడే ప్రధాన కారణం అని చెప్పాలి. అనుకున్నది జరిగితే ఒక్క మ్యాచ్ ముందుగానే హైదాబాద్ టీమ్ ప్లే ఆఫ్స్ కు వెళ్లిపోతుంది.

SRH vs GT- Heavy Rain In Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు వరుణ దేవుడే ప్రధాన కారణం అని చెప్పాలి. అనుకున్నది జరిగితే ఒక్క మ్యాచ్ ముందుగానే హైదాబాద్ టీమ్ ప్లే ఆఫ్స్ కు వెళ్లిపోతుంది.

హైదరాబాద్ లో భారీ వర్షం.. నేరుగా ప్లే ఆఫ్స్ కి SRH!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఇప్పుడు అందరి దృష్టి ప్లే ఆఫ్స్ మీదే ఉంది. ఇప్పటికే ఈ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్(19 పాయింట్లు), రాజస్థాన్ రాయల్స్(16 పాయింట్లు) ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయిపోయారు. ఇంకా కేవలం రెండు బెర్తులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ రెండు బెర్తులకు సంబంధించి ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ రేసులో ఎవరు ప్లే ఆఫ్స్ బెర్తును దక్కించుకుంటారు అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోయినట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం ఆ జట్టు నెత్తిన పాలు పోసింది.

ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 మ్యాచుల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచుల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో కొనసాగుతోంది. ఇంక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 13 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సొంతం చేసుకుంది. ఈ రేసులో హైదరాబాద్ జట్టుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ జట్టు ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఆ రెండింటిలో విజయం సాధిస్తే.. 18 పాయింట్లు సొంతం చేసుకుంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మే 16న ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయిపోయినట్లే.

తాజాగా హైదరాబాద్ భారీ వర్షం కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్ సంక్లిష్టంగా మారిపోయింది. ఈ మ్యాచ్ గనుక వర్షం వల్ల రద్దు అయితే రెండు జట్లకు తలో పాయింట్ వస్తుంది. అంటే హైదరాబాద్ జట్టుకు 13 మ్యాచుల్లో 15 పాయింట్లు వచ్చినట్లు అవుతుంది. రెండో మ్యాచ్ లో ఓడిపోయినా కూడా హైదరాబాద్ కు వచ్చే నష్టం అయితే లేదు. ఎందుకంటే చెన్నై- ఆర్సీబీ మధ్య మ్యాచ్ లో చెన్నై గెలిస్తే 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే.. 14 పాయింట్లతో నాలుగో స్థానంలోకి వెళ్తుంది. చెన్నై గెలిస్తే.. 15 పాయింట్లతో హైదరాబాద్ జట్టు నాలుగో స్థానంలో ఉంటుంది.

అదే ఆర్సీబీ గెలిస్తే.. 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ గనుక వర్షార్పణం జరిగితే.. హైదరాబాద్ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్ రేసులో అడుగు పెట్టేసినట్లే. కాకపోతే ఈ మ్యాచ్ రద్దయితే ఒక చిన్న వెలితి మిగిలిపోతుంది. అదేంటంటే.. రెండో స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశం కోల్పోతాం. ఐపీఎల్ లో రెండో స్థానంలో నిలిచిన జట్టుకు.. ఎలిమినేటర్ రూపంలో ఒక గోల్డెన్ ఛాన్స్ ఉంటుదన్న విషయం తెలిసిందే. కాకాపోతే ఆ అవకాశాన్ని మిస్ అయిపోతాం. ఏది ఏమైనా గుజరాత్ తో మ్యాచ్ జరిగినా.. జరగకపోయినా.. హైదరాబాద్ జట్టుకు మాత్రం మంచే జరుగుతుందని చెప్పాలి. మరి.. వర్షం కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్లబోతోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి