iDreamPost

Pushpa First Day Collections : భారీ ఓపెనింగ్స్ సాధించిన ఐకాన్ స్టార్

Pushpa First Day Collections : భారీ ఓపెనింగ్స్ సాధించిన ఐకాన్ స్టార్

నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప పార్ట్ 1 టాక్ తో సంబంధం లేకుండా సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు చేసుకుంది. తెలంగాణలో అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపు అవకాశాన్ని వాడుకుని కొత్త రికార్డులు సృష్టిస్తోంది. హిందీ వెర్షన్ సైతం 3 కోట్ల పై చిలుకు వసూలు చేసినట్టు అక్కడి ట్రేడ్ రిపోర్ట్. మలయాళం ప్రింట్లు ఆలస్యమైనా మధ్యాహ్నం నుంచి షోలు పడేలా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు కృషి చేయడంతో ఎట్టకేలకు ఫ్లో పెరుగుతోంది. ఇవాళ రేపు వీకెండ్ తో పాటు ఎలాంటి పోటీ లేకపోవడాన్ని పుష్ప పూర్తిగా వాడుకోనుంది. ఏపిలో టికెట్ రేట్ల ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఫైనల్ రన్ కు టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

విశ్వసనీయ సమాచారం మేరకు పుష్ప మొదటి రోజు అన్ని భాషలకు కలిపి సుమారు 38 కోట్ల దాకా షేర్ వసూలు చేసినట్టు తెలిసింది. అత్యధికంగా నైజామ్ లో 11 కోట్ల 40 లక్షలు రాబట్టింది. యూనిట్ దీన్ని అధికారికంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తమిళ వెర్షన్ కూడా మెల్లగా పికప్ అవుతోంది. అక్కడా పోటీగా ఇంకే మాస్ సినిమాలు లేవు. దాన్ని పుష్ప ఎంతమేరకు అడ్వాంటేజ్ గా తీసుకుంటుందో చూడాలి. సీడెడ్ లో 4 కోట్లు, గుంటూరు 2 కోట్ల 28 లక్షలు, ఉత్తరాంధ్ర 1 కోటి 80 లక్షలు, కృష్ణా 1 కోటి 15 లక్షలు దాకా రాబట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే షేర్ 24 కోట్ల దాకా తేలుతుంది. కర్ణాటక సోలోగా 3 కోట్ల 60 లక్షల దాకా వచ్చింది

ప్రతిదీ యూనిట్ నుంచి అధికారికంగా వచ్చింది కాదు కానీ ప్రస్తుతానికి ఈ ఫిగర్స్ ట్రేడ్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడీ ట్రెండ్ ని పుష్ప కంటిన్యూ చేయడం చాలా కీలకం. బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి 150 కోట్ల దాకా అవసరమవుతాయి. కానీ అది చేరుకోవడం సులభమైతే కాదు. అఖండకు అంత భారీ టాక్ వస్తేనే మొదటి వారం తర్వాత నెమ్మదించింది. పుష్ప తన చుట్టూ ఉన్న నెగటివ్ ట్రెండ్ ని దాటుకుని ఎదురీదితే అద్భుతాలు నమోదవుతాయి. పార్ట్ 2 మీద హైప్ రావాలన్నా ఇంతకు మించి బిజినెస్ జరగాలన్నా ఇప్పుడీ పుష్ప ది రైజ్ పార్ట్ 1 లాభాలు తేవడం చాలా కీలకం. చూడాలి మార్ అంచనాలు ఏమేరకు నిలబెట్టుకుంటుందో

Also Read : Aranyak Reoprt : అరణ్యక్ రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి