iDreamPost

ఆరోగ్య ఆంద్రప్రదేశ్ – 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాలు

ఆరోగ్య ఆంద్రప్రదేశ్ – 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాలు

విద్య, వైద్యం.. ఈ రెండిటిపై చేసే ఖర్చు తో పేద, మధ్య తరగతి ప్రజలు అప్పులపాలవుతున్నారు. అలంటి పరిస్థితి లేకుండా ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ సంస్థాగత చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పధకాన్ని విస్తరించిన సీఎం జగన్ ఇప్పుడు మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్తగా 5 వేల ఆరోగ్య ఉప కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మూడు దశల్లో వాటిని నిరి్మంచేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, తొలి విడత టెండర్లు వీలైనంత త్వరగా పిలిచి జనవరి 3 లేదా 4వ వారంలో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. వైద్య, ఆరోగ్య రంగంలో ‘నాడు–నేడు’ కార్యక్రమంపై సమీక్ష అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య రంగంపై మేనిఫెస్టోలో ఇచి్చన హామీల్లో ఇంత వరకు అమలు చేసిన, ఇక నుంచి అమలు చేయాల్సిన వాటిపై సీఎంకు అధికారులు వివరించారు.

జిల్లా స్థాయిలో జిల్లా సమగ్ర ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి వైద్య సేవలు అందిస్తాయి. రెవిన్యూ దడివిజన్ స్థాయిలో సామజిక ఆరోగ్య కేంద్రాలు, నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు సేవలు అందిస్తుండగా, ఆరోగ్య ఉప కేంద్రాలు గ్రామ స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తాయి. 5 వేలు అంతకన్నా ఎక్కువ ప్రజలకు సేవలు అందించేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి