iDreamPost

Revanth Reddy: CM రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఆరోగ్యశ్రీకి రేషన్‌ కార్డు నిబంధన సడలింపు!

  • Published Jan 30, 2024 | 7:53 AMUpdated Jan 30, 2024 | 9:52 AM

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోగ్యశ్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోగ్యశ్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Jan 30, 2024 | 7:53 AMUpdated Jan 30, 2024 | 9:52 AM
Revanth Reddy: CM రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఆరోగ్యశ్రీకి రేషన్‌ కార్డు నిబంధన సడలింపు!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యత ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సాధికారిత దిశగా చర్యలు చేపట్టింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచ్చిత ప్రయాణం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆతర్వాత పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలానే ఎన్నికల వేళ ప్రకటించినట్లుగానే ఆరు గ్యారెంటీల అమలుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈ హామీలన్నింటిని అమలు చేసేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్‌ సర్కార్‌. ఈ క్రమంలో తాజాగా రేవంత్‌ రెడ్డి ఆరోగ్యశ్రీకి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక ప్రత్యేకమైన నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. దీని వల్ల ప్రజలందరికీ.. అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని తెలిపారు. సచివాలయంలో సోమవారం మంత్రి దామోదర రాజ నర్సింహతో కలిసి వైద్య, ఆరోగ్య శాఖ అధికారలుతో సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డిజిటల్‌ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Important instructions on Arogyashri

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ పొందాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు కచ్చితంగా ఉండాలనే నిబంధన కారణంగా.. రేషన్‌ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. అందుకే దీన్ని సడలించే దిశగా ఆలోచన చేయాలన్నారు. మరోవైపు.. మెడికల్‌ కాలేజీ ఉన్న ప్రతి చోటా.. నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌ రెడ్డి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి