iDreamPost

142 మంది అమ్మాయిలపై కన్నేసిన ప్రిన్సిపల్.. ఎంతకు తెగించాడంటే?

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రిన్సిపాల్ ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 142 మంది అమ్మాయిలపై కన్నేశాడు. ఇతడు ఇంతటితో సరిపెట్టకుండా మరో పాడు పనికి తెర లేపాడు. ఈ కేసులో అసలేం జరిగిందంటే?

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రిన్సిపాల్ ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 142 మంది అమ్మాయిలపై కన్నేశాడు. ఇతడు ఇంతటితో సరిపెట్టకుండా మరో పాడు పనికి తెర లేపాడు. ఈ కేసులో అసలేం జరిగిందంటే?

142 మంది అమ్మాయిలపై కన్నేసిన ప్రిన్సిపల్.. ఎంతకు తెగించాడంటే?

పైన ఫోటోలో నీతిమంతుడిలా కనిపిస్తున్న ఇతగాడు హర్యానాలోని ఓ స్కూల్ లో ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతడు గత 6 ఏళ్ల నుంచి ఇక్కడే పని చేస్తున్నాడు. అయితే, ఇన్నేళ్ల కాలంలో విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఈ దుర్మార్గుడు.. చివరికి ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.., ఏకంగా 142 మంది బాలికలపై కన్నేశాడు. చదువు పేరుతో వారిని నమ్మించి చేయాల్సినవన్నీ చేసేశాడు. ఇక అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ వ్యవహారం చివరికి రాష్ట్రపతి, ప్రధాని వరకు వెళ్లింది. దీంతో ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఎట్టకేలకు ఇతగాడిని జైలుకు తరలించింది. ఈ దుర్మార్గుడు చేసిన దారుణం ఏంటి? 142 మంది బాలికలను ఏం చేశాడు? సంచలనంగా మారిన ఈ కేసులో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హర్యానా జింద్ జిల్లాలోని ఓ ప్రాంతంలోని ఓ స్కూల్లో ఇతడు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడికి ఎంతో మంది బాలికలు వచ్చి చదువుకునేవారు. కానీ, వారికి విద్యా బుద్దులు నేర్పాల్సిన ఈ దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. పాఠశాలకు వచ్చిన అమ్మాయిలను చదువు పేరుతో లోబర్చుకునేవాడు. ఆ తర్వాత టైమ్ చూసుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడేవాడు. ఇతడి పనులను తట్టుకోలేని ఓ 15 మంది బాలికలు రాష్ట్రపతి, ప్రధాని, భారత ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మహిళా కమిషన్ తో పాటు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసును విచారించేందుకు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు అయింది. ఆ కమిటీ ఏకంగా ఆ బాలికలు చదువుకున్న పాఠశాలను సందర్శించి అందులోని విద్యార్థులను విచారించగా మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రిన్సిపల్ ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 142 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. అయితే, నవంబర్ 4న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ఈ నెల 7న కోర్టుకు తరలించారు. అనంతరం విచారించిన న్యాయస్థానం ఆ నిందితుడిని జైలు శిక్ష విధించింది. ఇదే కేసు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. చదువు చెప్పాల్సిన ఈ ప్రిన్సిపాల్.. ఏకంగా 142 మంది బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన ఈ దుర్మార్గుడి పాడు పనులపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి