iDreamPost
android-app
ios-app

టీమిండియాకు ఆడనని చెప్పా.. ఆ కండీషన్ తోనే జట్టులోకి వచ్చా: హార్దిక్ పాండ్యా

  • Author Soma Sekhar Published - 09:16 PM, Fri - 28 July 23
  • Author Soma Sekhar Published - 09:16 PM, Fri - 28 July 23
టీమిండియాకు ఆడనని చెప్పా.. ఆ కండీషన్ తోనే జట్టులోకి వచ్చా: హార్దిక్ పాండ్యా

టీమిండియా క్రికెట్ లో ఎంతో మంది నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. కానీ వారందరు ఏదో ఒక ఫార్మాట్ లో మాత్రమే రాణిస్తున్నారు. ఇక మూడు ఫార్మాట్స్ లో రాణించే ఆటగాళ్లు తక్కువనే చెప్పాలి. ఇక గత కొంతకాలంగా టీ20ల్లోనే సత్తా చాటుతున్నాడు టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. వన్డేల్లో అవకాశాలు వచ్చినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. గాయాల కారణంగా తన ఓవర్ల కోటాను కూడా పూర్తిచేసుకోలేకపోతున్నాడు. తాజాగా విండీస్ తో జరిగిన మ్యాచ్ లో 3 ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చి.. కీలకమైన కేల్ మేయర్స్ ను అవుట్ చేశాడు. కానీ బ్యాటింగ్ లో మాత్రం దురదృష్టవశాత్తు 5 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. విండీస్ తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియాలోకి తన కమ్ బ్యాక్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

హార్దిక్ పాండ్యా.. తక్కువ కాలంలోనే టీమిండియాలో నిఖార్సైన ఆల్ రౌండర్ గా పేరుతెచ్చుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో టీమిండియా మిడిలార్డర్ కు వెన్నముకగా నిలుస్తూ వస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా పాండ్యాను గాయాలు వేధిస్తున్నాయి. దాంతో జట్టులో చోటు కోల్పోవడమే కాకుండా.. తన ఫామ్ ను కూడా కోల్పోయాడు. దాంతో పాండ్యాను ఇక టీమిండియాలో చూడటం కష్టమే అని భావించారు అంతా. కానీ అనూహ్యంగా కష్టపడి జట్టులో చోటు సంపాదించుకున్నాడు పాండ్యా. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియాలోకి తన కమ్ బ్యాక్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ..”గాయం తిరగబెట్టడంతో.. ఇంటికే పరిమితం అయ్యి విశ్రాంతి తీసుకున్నా. అయినప్పటికీ ఇంట్లోనే ఫిట్ నెస్ కు సంబంధించిన వ్యాయామాలు చేశా. ఈ సందర్భంగా నా సహచర ఆటగాళ్లకు నేను ఒక్కటే చెప్పా. నేను జట్టులోకి తిరిగి వచ్చానంటే ఆల్ రౌండర్ బాధ్యతలు స్వీకరిస్తా. లేదంటే జట్టుకు ఆడనని చెప్పేశా. ఎందుకంటే అది నాకు ఛాలెంజింగ్ టైమ్. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆడకుండా ఉంటేనే సంతోషం. ఇలాంటి టైమ్ లో జట్టులోకి వచ్చి అనవసరంగా మరో ప్లేయర్ స్థానాన్ని తీసుకున్నట్లు అవుతుంది” అని పాండ్యా టీమిండియాలోకి తన కమ్ బ్యాక్ గురించి చెప్పుకొచ్చాడు. కాగా.. టీ20 దుమ్మురేపుతున్న పాండ్యా వన్డేలకు వచ్చేసరికి చతికిలపడిపోతున్నాడు. గాయాల బెడద ఒకవైపు.. పూర్ ఫామ్ మరోవైపుతో పాండ్యా ఇబ్బంది పడుతున్నాడు. వరల్డ్ కప్ లో పాండ్యా లాంటి ఆల్ రౌండర్ టీమిండియాకు ఎంతో అవసరం. కాబట్టి అతడు ఎంత త్వరగా ఫామ్ లోకి వస్తే.. టీమిండియాకు అంత లాభం.

ఇదికూడా చదవండి: అంతర్జాతీయ క్రికెట్ కు భువనేశ్వర్ కుమార్ రిటైర్ మెంట్? ముందే హింట్ ఇచ్చాడా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి