iDreamPost
android-app
ios-app

రోహిత్‌ శర్మ కాదు.. ముంబైని ఓడించింది హార్దిక్‌ పాండ్యానే!

  • Published Apr 15, 2024 | 10:51 AM Updated Updated Apr 15, 2024 | 10:51 AM

Hardik Pandya, MI vs CSK, IPL 2024: సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమి పాలైంది. అయితే.. ఈ ఓటమికి కారణం ఎంఐ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అని విమర్శలు వస్తున్నాయి. దాని గురించి ఇప్పుడు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, MI vs CSK, IPL 2024: సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమి పాలైంది. అయితే.. ఈ ఓటమికి కారణం ఎంఐ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అని విమర్శలు వస్తున్నాయి. దాని గురించి ఇప్పుడు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 15, 2024 | 10:51 AMUpdated Apr 15, 2024 | 10:51 AM
రోహిత్‌ శర్మ కాదు.. ముంబైని ఓడించింది హార్దిక్‌ పాండ్యానే!

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే.. ఈ ఓటమికి కారణం రోహిత్‌ ఇన్నింగ్సే అని చాలా మంది క్రికెట్‌ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. పాండ్యాపై కోపంతో రోహిత్‌ శర్మ కేవలం తన సెంచరీ కోసం మాత్రమే ఆడాడని, టీమ్‌ను గెలిపించేందుకు ఆడలేదని అంటున్నారు. ఆరంభం నుంచి బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్‌ శర్మ.. మరో ఎండ్‌ నుంచి ఎటువంటి సహకారం లేకపోయినా.. ఒక్కడే విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. 63 బంతుల్లో 11 ఫోర్లు,, 5 సిక్సులతో 105 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

మిగిలిన బ్యాటర్లలో ఇషాన్‌ కిషన్‌ 15 బంతుల్లో 23, తిలక్‌ వర్మ 20 బంతుల్లో 31 పరుగులు చేసి రాణించగా.. మిగిలిన వారంతా దారుణంగా విఫలం అయ్యారు. ముఖ్యంగా ఎన్నో అంచనాల మధ్య టీమ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ డకౌట్‌ అయ్యాడు. కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా 6 బంతులాడి 2 రన్స్‌ మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. టిమ్‌ డేవిడ్‌ 13, షెఫర్డ్‌ 1, మొహమ్మద్‌ నబీ 4 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇలా రోహిత్‌ శర్మ తప్పింతే ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. అయితే.. ముంబై ఇండియన్స్‌ ఓటమికి బ్యాటింగ్‌ సరిగా చేయలేకపోవడం ఒక్కటే కారణం కాదు. బౌలింగ్‌లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తీసుకున్న చెత్త నిర్ణయాలు కూడా ముంబై ఇండియన్స్‌ ఓటమిని శాసించాయి. తాను డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌ కాకపోయినా.. ఆకాశ్‌ అనే ఓ బౌలర్‌ ఉన్నా.. కూడా చివరి ఓవర్‌ తానే వేయడం ముంబై ఇండియన్స్‌ కొంపముంచింది.

Hardik Pandyan defeated Mumbai!

చివరి ఓవర్‌లో నాలుగు బంతులు మిగిలి ఉండగా బ్యాటింగ్‌కు వచ్చిన ఎంఎస్‌ ధోని.. పాండ్యా బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. వరుసగా మూడు సిక్సులు బాది చివరి బాల్‌కు రెండు రన్స్‌ తీసి.. మొత్తం 4 బంతుల్లో 20 పరుగులు సాధించాడు. ముంబై ఇండియన్స్‌ కూడా 20 పరుగుల తేడాతోనే ఓడిపోయింది. చివర్లో అన్ని పరుగులు ఇవ్వకపోయి ఉంటే.. మూమెంటమ్‌ ముంబై వైపే ఉండేది. కెప్టెన్‌గా పాండ్యా బౌలింగ్‌ మార్పుల్లో చేసిన తప్పిదాలతోనే ముంబై ఇండియన్స్‌ ఓడిపోయిందని క్రికెట్‌ అభిమానులతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా పాండ్యా చివరి ఓవర్‌ వేయడాన్ని తప్పుబట్టాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.