iDreamPost

13 మంది స్టార్ క్రికెటర్లకు అస్వస్థత! ఒకరికి సీరియస్.. అసలేం జరిగిందంటే?

ప్రపంచ క్రికెట్ లో ఊహించని సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 13 మంది స్టార్ క్రికెటర్లు అస్వస్థతకు గురైయ్యారని సమాచారం. అందులో ఓ ప్లేయర్ కు సీరియస్ గా ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రపంచ క్రికెట్ లో ఊహించని సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 13 మంది స్టార్ క్రికెటర్లు అస్వస్థతకు గురైయ్యారని సమాచారం. అందులో ఓ ప్లేయర్ కు సీరియస్ గా ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

13 మంది స్టార్ క్రికెటర్లకు అస్వస్థత! ఒకరికి సీరియస్.. అసలేం జరిగిందంటే?

ప్రపంచ క్రికెట్ లో ఊహించని సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 13 మంది స్టార్ క్రికెటర్లు అస్వస్థతకు గురైయ్యారని సమాచారం. దీంతో వారందరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో ఒక ఆటగాడికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో అనుకోని సంఘటన జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగా కరాచీ కింగ్స్ టీమ్ కు చెందిన 13 మంది క్రికెటర్లు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా.. అందులో ఓ ప్లేయర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆటగాడు సౌతాఫ్రికాకు చెందిన స్పిన్నర్ తబ్రైజ్ షంషీ అని తెలుస్తోంది. ఫిబ్రవరి 29న క్వెట్టా గ్లాడియేటర్స్ తో జరిగిన మ్యాచ్ కు ముందు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అస్వస్థతకు గురైన ఆటగాళ్లలో ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ సామ్స్, సౌతాఫ్రికాకు చెందిన లూయిస్ డు ఫ్లూయ్. కరాచీ కింగ్స్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Illness for 13 star cricketers!

అయితే ఇంత మంది ప్లేయర్లు అనారోగ్యం బారిన పడినప్పటికీ.. కరాచీ కింగ్స్ యాజమాన్యం, పీఎస్ఎల్ లీగ్ మేనేజ్ మెంట్ ఈ విషయాన్ని బయటకి పొక్కకుండా.. జాగ్రత్త పడుతున్నట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తోంది. అయితే ఈ ఘటనపై కరాచీ కింగ్స్ యాజమాన్యం లేదా పీఎస్ఎల్ మేనేజ్ మెంట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. పైన తెలిపిన ఆటగాళ్ల ప్లేసుల్లో వేరే ముగ్గురు విదేశీ ప్లేయర్లతో బరిలోకి దిగింది కరాచీ కింగ్స్ టీమ్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం 5 వికెట్లు కోల్పోయి చివరి బాల్ కు విజయం సాధించిందిద క్వెట్టా గ్లాడియేటర్స్ టీమ్. జేసన్ రాయ్ 52 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. మరి ఇంటర్నేషన్ టీ20 లీగ్ ఇలాంటి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఇషాన్, అయ్యర్​పై వేటు.. హార్దిక్​ను బీసీసీఐ వదిలేయడానికి కారణమిదే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి