iDreamPost

Yuzvendra Chahal: చాహల్​కు లాలీపాప్ ఇచ్చి బుజ్జగిస్తున్నారు.. సెలక్టర్లపై భజ్జీ సెటైర్లు

  • Author Soma Sekhar Published - 03:49 PM, Sat - 2 December 23

చాహల్ ను టీ20లకు కాకుండా వన్డే జట్టులోకి తీసుకోవడం, పూజారా, రహనేలను టెస్టు జట్టులోకి తీసుకోకపోవడంపై తనదైన శైలిలో సెలెక్టర్లపై సెటైర్లు వేశాడు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.

చాహల్ ను టీ20లకు కాకుండా వన్డే జట్టులోకి తీసుకోవడం, పూజారా, రహనేలను టెస్టు జట్టులోకి తీసుకోకపోవడంపై తనదైన శైలిలో సెలెక్టర్లపై సెటైర్లు వేశాడు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.

  • Author Soma Sekhar Published - 03:49 PM, Sat - 2 December 23
Yuzvendra Chahal: చాహల్​కు లాలీపాప్ ఇచ్చి బుజ్జగిస్తున్నారు.. సెలక్టర్లపై భజ్జీ సెటైర్లు

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సిఉంది. ఇటీవలే సఫారీ పర్యటన కోసం సెలెక్టర్లు మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించారు. టీ20, వన్డే, టెస్టు లకు వేర్వేరు కెప్టెన్స్ ను నియమించింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు ఎంపిక చేసిన భారత జట్లపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పేస్ కు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్ లపై స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. తాజాగా ఈ లిస్ట్ లోకి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేరాడు. చాహల్ ను టీ20లకు కాకుండా వన్డే జట్టులోకి తీసుకోవడం, పూజారా, రహనేలను టెస్టు జట్టులోకి తీసుకోకపోవడంపై తనదైన శైలిలో సెలెక్టర్లపై సెటైర్లు వేశాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇందుకోసం మూడు ఫార్మాట్లకు అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్, టెస్టులకు రోహిత్ శర్మలను కెప్టెన్స్ గా అనౌన్స్ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. స్టార్ స్పిన్నర్ అయిన యజ్వేంద్ర చాహల్ ను టీ20లకు పక్కన పెట్టి.. వన్డే జట్టులోకి తీసుకుంది. ఈ విషయం టీమిండియా ఫ్యాన్స్ తో పాటుగా పలువురు మాజీలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. వచ్చే ఏడాది జూన్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2024 మెగాటోర్నీని దృష్టిలో పెట్టుకునే ఈ జట్లను ఎంపిక చేసింది బీసీసీఐ.

ఇక ఈ ఎంపికపై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు టీమిండియా మాజీ స్పిన్నర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్. చాహల్ ను వన్డేలకు ఎంపిక చేయడంపై భజ్జీ ఈ విధంగా మాట్లాడాడు..”చాహల్ ను టీ20లకు ఎంపిక చేయకుండా.. వన్డేలకు ఎంపిక చేయడం ఎలా ఉందంటే? ఓ లాలీపాప్ అతడి చేతికిచ్చి నాక్కో అని ఊరడించినట్లు ఉంది. నువ్వ ఎంత గొప్పగా రాణించినా.. నీకు టీ20ల్లో చోటు దక్కదని ఇన్ డైరెక్ట్ గానే చెప్పారనిపిస్తోంది. ఇక సీనియర్లు అయిన పుజారా, రహనేలను పక్కన పెట్టడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అక్కడి పిచ్ లు సవాలుతో కూడుకున్నవి. వాటిని కుర్రాళ్లు తట్టుకోగలరా? అన్నదే అసలు ప్రశ్న. యంగ్ స్టర్స్ కు అవకాశాలు ఇవ్వడాన్ని నేను తప్పుపట్టడం లేదు” అంటూ భజ్జీ చెప్పుకొచ్చాడు.

కాగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు విశ్రాంతి కోరగా వారికి వైట్ బాల్ క్రికెట్ నుంచి రెస్ట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. కేవలం ముగ్గురు ప్లేయర్లు మాత్రమే ఈ మూడు ఫార్మాట్స్ కు ఎంపికైయ్యారు. వారిలో బౌలర్ ముకేశ్ కుమర్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ లు ఉన్నారు. మరి హర్భజన్ అన్నట్లుగా చాహల్ ను టీ20లకు ఎంపిక చేయకపోవడం తప్పేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి