iDreamPost

OTTలోకి హనుమాన్ మూవీ.. కలెక్షన్స్ ఫుల్ గా ఉన్నా కూడా!

  • Published Jan 29, 2024 | 4:41 PMUpdated Jan 29, 2024 | 5:08 PM

దేశవ్యాప్తంగా అందరికి హనుమాన్ మూవీ ఫీవర్ గా మారింది. ప్రపంచ దేశాల్లో సైతం ఈ మూవీ రికార్డులను సృష్టిస్తుంది. అయితే ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న హనుమాన్ మూవీ త్వరలోనే ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. అది ఎప్పుడంటే..

దేశవ్యాప్తంగా అందరికి హనుమాన్ మూవీ ఫీవర్ గా మారింది. ప్రపంచ దేశాల్లో సైతం ఈ మూవీ రికార్డులను సృష్టిస్తుంది. అయితే ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న హనుమాన్ మూవీ త్వరలోనే ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. అది ఎప్పుడంటే..

  • Published Jan 29, 2024 | 4:41 PMUpdated Jan 29, 2024 | 5:08 PM
OTTలోకి  హనుమాన్ మూవీ.. కలెక్షన్స్ ఫుల్ గా ఉన్నా కూడా!

మనుషులతో పాటు మూవీ ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు వంద, రెండు వందల రోజులు ఆడితే బ్లాక్ బస్టర్ అనేవాళ్ళు.. ఇప్పుడు మాత్రం వారం రోజులు ఆడితే బ్లాక్ బస్టర్ అంటున్నారు. వంద రోజుల సెలబ్రేషన్స్ చేసుకునే రోజులు పోయి వంద కోట్లు, రెండు వందల కోట్ల సెలబ్రేషన్స్ చేసుకునే రోజులు వచ్చేశాయి. ఈ కారణంగా సినిమా రిలీజ్ ల విషయంలో బడా నిర్మాతలు ముందుగానే కర్చీఫ్ లు వేసేసుకుంటారు. సంక్రాంతి లాంటి పండుగ వచ్చిందంటే ఆ సీజన్ లో సినిమా రిలీజ్ చేయాల్సిందే. టాక్ తేడా వచ్చినా పండగ మూడ్ లో కలెక్షన్స్ వస్తాయని అలా చేస్తారు. మూవీ ఆయుష్షు తగ్గిపోవడం.. సినిమాలపై ఓటీటీ ప్రభావం వంటి కారణాల వల్ల పోటీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలోకి మూడు పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాగా హనుమ్యాన్ వచ్చింది.

చిన్న సినిమా అనుకుంటే.. ఒక మహా విస్ఫోటనంలా పేలింది. థియేటర్స్ పెద్దగా లేని పరిస్థితి నుంచి పట్టుబట్టి మరీ థియేటర్స్ ఇచ్చే పరిస్థితికి వెళ్ళింది సినిమా రేంజ్. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమా విడుదలై మూడు వారాలు అయినా గానీ ఇంకా ఊపు తగ్గలేదు. టికెట్లు దొరకడం లేదు. హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. అతి తక్కువ సమయంలోనే ఈ సినిమా భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇప్పటికే 250 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. 300 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం థియేటర్లలో ఇంక హనుమ్యాన్ మ్యానియా కొనసాగుతుంది. అలాంటి హనుమ్యాన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఒక రకంగా మూవీ లవర్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ అయినా ఓటీటీలో చూడాలనుకునేవారికి మాత్రం గుడ్ న్యూసే.

ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడాలని.. ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి నిర్మాత జేబు నిండాలని హనుమాన్ భక్తులు ఆశించారు. కానీ ఓటీటీ ఒప్పందం మేరకు ఈ మూవీ చాలా త్వరగా స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మూవీ ఫీవర్ తగ్గకముందే ఆ సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఆయా సంస్థలు ఫిక్స్ అవుతాయి. ఈ క్రమంలో హనుమ్యాన్ విషయంలో కూడా బజ్ ఉన్నప్పుడే స్ట్రీమింగ్ చేసి క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారట ఓటీటీ నిర్వాహకులు. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 కొనుగోలు చేసిందని.. ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక స్ట్రీమింగ్ డేట్ పై చర్చలు కొనసాగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

కాగా, హనుమాన్ మూవీ అందరూ అంచనాలను తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో.. ప్రశాంత్ వర్మ పార్ట్ 2 ను వరల్డ్ స్థాయిలో తీసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేశారు. అలాగే వచ్చే సంక్రాంతికి జై హనుమాన్ సినిమాను బరిలోకి దించబోతోన్నట్టుగా ప్రశాంత్ వర్మ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి, త్వరలో ఓటీటీలో హనుమాన్ మూవీ అలరించబోతుందనే వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి