iDreamPost

తెలుగులో బాహుబలి నిర్మాతల హారర్ వెబ్‌సిరీస్ – స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published May 10, 2024 | 1:03 PMUpdated May 10, 2024 | 1:03 PM

ఇటీవల కాలంలో హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సినిమాలపైనే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బహుబలి ప్రొడ్యూసర్స్ తాజాగా తెలుగులో యక్షిణి అనే హారర్ వెబ్ సిరీస్ రూపొందించారు. కాగా, ఈ వెబ్ సిరీస్ అనేది త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇంతకి ఎక్కడంటే..

ఇటీవల కాలంలో హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సినిమాలపైనే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బహుబలి ప్రొడ్యూసర్స్ తాజాగా తెలుగులో యక్షిణి అనే హారర్ వెబ్ సిరీస్ రూపొందించారు. కాగా, ఈ వెబ్ సిరీస్ అనేది త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published May 10, 2024 | 1:03 PMUpdated May 10, 2024 | 1:03 PM
తెలుగులో బాహుబలి నిర్మాతల హారర్ వెబ్‌సిరీస్ – స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇటీవల కాలంలో హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సినిమాలపైనే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అడియాన్స్ అభిరుచుల మేరకు దర్శకులు, నిర్మతలు కూడా ఈ తరహా సినిమాలనే ఈ మధ్య ఎక్కువగా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ భాషాల్లోనూ హారర్ సినిమాలు, వెబ్ సీరిస్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని థియేటర్లలో విడుదల చేస్తుంటే.. మరి కొన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా బాహుబలి ప్రొడ్యూసర్స్ కూడా తెలుగులో హారర్ బ్యాక్ డ్రాప్ లో ఓ వెబ్ సిరీస్ ను చేస్తోన్నారు. పైగా ఈ వెబ్ సిరీస్ కు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కాగా, ఈ వెబ్ సిరీస్ కు ‘యక్షిణి’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. అలాగే త్వరలో ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుంది. ఇంతకి ఎక్కడంటే..

తాజాగా బహుబలి ప్రొడ్యూసర్స్ తెలుగులో రూపొందిస్తున్న హారర్ వెబ్ సిరీస్ ‘యక్షిణి’. కాగా, ఈ వెబ్ సిరీస్ ను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో వేదిక, రాహుల్ విజయ్‌, అజయ్‌, మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వెబ్ సిరీస్ లో వేదిగా డీ గ్లామర్ లుక్‌లో వైవిధ్యంగా కనిపించనుంది. కాగా, ఇందులో ప్రతి ఎపిసోడ్ చాలా థ్రిల్లింగ్ ను పంచుతోందని చెబుతున్నారు. ఇక ఈ సిరీస్ లో కనిపించే ప్రతి పాత్ర మిస్టరీయస్ గా సాగుతుందని సమాచారం. అంతేకాకుండా.. ఇందులో ఉండే ప్రతిఒక్క హారర్ ఎలిమెంట్స్ అడియోన్స్ భయపెట్టిన విధంగా ఉంటుయని అంటున్నారు.అయితే యక్షిణి వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ అనేది తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.ఇకపోతే త్వరలోనే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలిసింది. అలాగే ఈ వెబ్ సిరీస్ దర్శకుడి తో పాటు ఇందులో ఎన్ని ఎపిసోడ్స్ తో సిరీస్ తెరకెక్కనుందో త్వరలోనే క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక హీరోయిన్ వేదిక విషయానికొస్తే.. ఈమె మొదటగా కళ్యాణ్ రామ్ విజయదశమి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత దగ్గరగా దూరంగా, బాణం, బాలకృష్ణ రూలర్‌తో పాటు కాంచన3లో నటించింది. అలలాగే ఈ మధ్య రజాకార్ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషించింది. కాగా, ప్రస్తుతానికైతే వేదిక నటించిన ఫియర్‌తో పాటు జంగిల్ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మరి, త్వరలో హారర్ వెబ్ సిరీస్ [‘యక్షిణి’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి