iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేస్తున్న తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే

  • Published May 15, 2024 | 11:59 AMUpdated May 15, 2024 | 11:59 AM

OTT Release: ఈమధ్య కాలంలో చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించిన సినిమాలు, సిరీస్‌ల సంఖ్య పెరుగుతోంది. ఇలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచివిజయం సాధించిన ఓ సినిమా.. ఓటీటీలో విడుదల కానుంది. ఆ వివరాలు..

OTT Release: ఈమధ్య కాలంలో చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించిన సినిమాలు, సిరీస్‌ల సంఖ్య పెరుగుతోంది. ఇలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచివిజయం సాధించిన ఓ సినిమా.. ఓటీటీలో విడుదల కానుంది. ఆ వివరాలు..

  • Published May 15, 2024 | 11:59 AMUpdated May 15, 2024 | 11:59 AM
OTTలోకి వచ్చేస్తున్న తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే

థియేటర్లు, ఓటీటీల్లో చిన్న చిత్రాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇక మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు హిట్టు కొడుతున్నాయి. ఈ కోవకు చెందనిదే 90స్‌ వెబ్‌సిరీస్‌. మధ్యతరగతి వారి జీవితాలను ప్రతిబింబించేలా రియాలిస్టిక్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్‌ భారీ విజయం సాధించింది. ఇక అదలా ఉంచితే.. ఈమధ్య కాలంలో యూట్యూబ్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా సిల్వర్‌ స్క్రీన్‌ మీద తమ అదృష‍్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా చైతన్య రావ్‌ ఈ జాబితాలో చేరారు. 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్‍తో పాపులర్ అయిన చైతన్య రావ్‌.. తర్వాత సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కుతున్న చిత్రాలను చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా చైతన్య రావ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం షరతులు వర్తిస్తాయి.

ఈ సినిమా ఈ ఏడాది మార్చి 15న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. కానీ సినిమాలోని పాటలు బాగా పాపులర్‌ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌ గురించి ఆసక్తికర సమాచారం వినిపిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మే 18వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. “మంచి మిడిల్ క్లాస్ మూవీ చూడాలని ఉందా.. అయితే షరతులు వర్తిస్తాయి సినిమా మే 18వ తేదీన ఆహాలో ప్రీమియర్ కానుంది” అని ఆహా నేడు (మే 14) ట్వీట్ చేసింది.

A middle class family movie into OTT

రెండు నెలల తర్వాత..

ఇక షరతులు వర్తిస్తాయి చిత్రంలో చైతన్య రావ్, భూమి శెట్టి జంటగా నటించారు. సినిమాలో వీరు చిరంజీవి, విజయశాంతి అనే క్యారెక్టర్లు చేశారు. ఈ సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించింది. యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు అనగా థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత మే 18న ఈ చిత్రం ఆహా ఓటీటీలో అడుగుపెడుతోంది. షరతులు వర్తిస్తాయి చిత్రంలో చైతన్య, భూమితో పాటు నంద కోశోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పలమూరు, వెంకీ, శివ కల్యాణ్, మల్లేశ్ బలస్త్ కీలకపాత్రలు పోషించారు. అక్షర (కుమార స్వామి) దర్శకత్వం వహించిన ఈ మూవీని స్టార్ లైట్స్ స్టూడియోస్ పతాకంపై నాగార్జున సామల నిర్మించారు. అరుణ్ చిలువేరు ఈ చిత్రానికి సంగీతం అందించారు.

కథేంటి అంటే..

ప్రభుత్వ ఉద్యోగం చేసే చిరంజీవి (చైతన్య రావ్) కుటుంబాన్ని పోషించేందుకు ఇబ్బందులు పడుతుంటాడు. తాను ప్రేమిస్తున్న విజయశాంతి (భూమి శెట్టి) అతడికి మద్దతుగా ఉంటుంది. వీరి పెళ్లి తర్వాత.. అనుకోకుండా ఆర్థికంగా ఓ విషయంలో చిరంజీవి మోసపోతాడు. దీంతో వారి జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది.. వారికి వచ్చిన కష్టం ఏటి.. దాన్నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది అనేదే ఈ మూవీలో ప్రధానంగా ఉంటుంది. షరతులు వర్తిస్తాయి సినిమాలో చైతన్య రావ్ మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ నిరూపించుకున్నారు. మధ్యతరగతి వ్యక్తిగా మంచి నటనను ప్రదర్శించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి