iDreamPost

కరోనా సంక్షోభం – సైబర్ దాడులకు అవకాశంగా మార్చుకున్న హ్యాకర్లు

కరోనా సంక్షోభం – సైబర్ దాడులకు అవకాశంగా మార్చుకున్న హ్యాకర్లు

కరోనా రక్కసి ప్రపంచాన్ని పీడిస్తున్న వేళ ఇదే అదనుగా హ్యాకర్లు సైబర్ దాడులకు తెగబడుతున్నారు. యుజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి మెయిల్స్, వాట్సాప్ ద్వారా మాల్వేర్ ని చొప్పించే ప్రయత్నం చేస్తునట్టు బెంగుళూరు కు చెందిన సుబెక్స్ అనే అనెలటిక్స్ సంస్థ గుర్తించి హెచ్చరికలు జారీచేసింది. మ్యానఫ్యాక్చరింగ్ సంస్థలు తప్ప మిగిలిన అన్ని రంగాలపై కరోనా ఔట్ బ్రేక్ తరువాత ఈ తరహా ఫిషింగ్ దాడులకు హ్యాకర్లు తెగబడినట్టు గుర్తించామని చెప్పుకోచ్చారు.

ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో ఐటి ఉద్యోగులకు ఆయా సంస్థలు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాయి. దీంతో ఆఫీసులో కల్పించే సైబర్ సెక్యురిటీలు ఇంటి దగ్గన నుండి పని చేసే ఉద్యోగులకి కల్పించలేవు. ఈ అవకాశాన్నే హ్యాకర్లు తమకు అనువుగా మలుచుకుని వారి డివైజుల్లోకి ఈమెయిల్స్ , సోషల్ మీడీయా లింక్స్ , ఇన్స్టంట్ మెసేజ్ లు పంపి రౌటర్లను హ్యాక్ చేసి మాల్వేర్ ని చొప్పించే ప్రయత్నం చేస్తునట్టు చెప్పుకొచ్చారు.

అయితే డివైజుల ద్వరా జోరబడిన వెంటనే హ్యాక్ చేయకపోయినా నెట్వర్కులను హ్యాక్ చేయడానికి వీలుగా అదే డివైజుల్లోకి ట్రొజన్ ని చోప్పించ సదరు ఉద్యొగులు ఎప్పుడైతే ఆఫీస్ నెట్వర్క్ కి కనక్ట్ అవుతారో వెనువెంటనే సైబర్ దాడులు నిర్వహించే అవకాశం ఉందని, ఈ తరహా హ్యాకర్లు మోత్తం దాదాపు 23 రకాల కామన్ ఫైల్ ఎక్స్టెన్షన్లు ఉపయోగిస్తునట్టు సుబెక్స్ కంపెనీ వెళ్ళడించింది.

హ్యాకర్లు ఉపయొగించే కామన్ ఎక్స్టెన్షన్ ఫైల్స్ docs,eps,xlcs,mp3,mp4,zip,rar లో ఎంక్రిప్టెండ్ మాల్వేర్ ఉంటుంది కాబట్టి ఇంటి నుండీ ఆఫీసు పని చెసే ఉద్యోగులు అనుమానాస్పద ఫైల్స్ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఏమాత్రం అనుమానం వచ్చినా ఫైల్స్ పై క్లిక్ చెయకపోవడమే మంచిదని ప్రభుత్వాలు కరోనా వైరస్ పై ప్రకటన చేసినప్పుడల్లా హ్యాకర్లు ఫైల్ పేర్లు వాటికి అనుగుణంగా మార్చి పంపుతారని కావున వచ్చే ఫైల్స్ పై అత్యనత జాగ్రత్తగా వ్యవహరించాలని సుబెక్స్ సంస్థ పేర్కోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి