iDreamPost

ఎంత మంచి బాసో.. ఉద్యోగులకు ఏకంగా కార్లు గిఫ్ట్

  • Published Jan 05, 2024 | 12:06 PMUpdated Jan 05, 2024 | 12:19 PM

ఇటీవల కాలంలో చాలా ఐటీ కంపెనీలు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల శ్రమను గుర్తించి, వారికి ఖరీదు అయిన బహుమతులను అందజేస్తున్నాయి. తాజాగా చెన్నైకు చెందిన ఓ ఐటీ సంస్థ కూడా కంపెనీలో విశ్వసనీయంగా పనిచేసే ఉద్యోగులకు అత్యంత విలువగల బహుమతులను అందజేసింది. కాగా, అదేమీ చిన్నా చితకా బహుమతి కూడా కాదు. ఇంతకి అదేమిటంటే..

ఇటీవల కాలంలో చాలా ఐటీ కంపెనీలు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల శ్రమను గుర్తించి, వారికి ఖరీదు అయిన బహుమతులను అందజేస్తున్నాయి. తాజాగా చెన్నైకు చెందిన ఓ ఐటీ సంస్థ కూడా కంపెనీలో విశ్వసనీయంగా పనిచేసే ఉద్యోగులకు అత్యంత విలువగల బహుమతులను అందజేసింది. కాగా, అదేమీ చిన్నా చితకా బహుమతి కూడా కాదు. ఇంతకి అదేమిటంటే..

  • Published Jan 05, 2024 | 12:06 PMUpdated Jan 05, 2024 | 12:19 PM
ఎంత మంచి బాసో.. ఉద్యోగులకు ఏకంగా కార్లు గిఫ్ట్

సాధారణంగా ఒక సంస్థలో విశ్వసనీయంగా పనిచేసే ఉద్యోగులకు జీతంతో పాటు బోనస్‌ లు కూడా ఇస్తారు. ఎందుకంటే.. సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమ పూర్తి శక్తి సామర్థ్యానికి అనుగుణంగా పనిచేస్తుంటారు. అందుకే కష్టపడి పనిచేసే ఉద్యోగులకు ప్రశంసలతో పాటు బహుమతులు కూడా అందజేస్తారు. అయితే ఇటీవల కాలంలో చాలా ఐటీ కంపెనీలు సంస్థలో చాలా ఏళ్ల పాటు పనిచేసే ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు అందజేయడం చూస్తున్నాం.  ఒక రకంగా సంస్థ నష్టాల్లో ఉన్న చాలామంది టెక్ ఉద్యోగులు తమ సంస్థ ఎదుగుదలకు అండగా నిలిచి తమ వంతు తోడ్పాటును అందిస్తున్నారు. అలాంటి వారి కోసం పండుగ కానుకగా ఐటీ కంపెనీలు ఖరీదైన బహుమతులను అందజేస్తోంది. తాజాగా చెన్నైలో ఓ ఐటీ సంస్థ తమ కంపెనీ ఉద్యోగులకు అత్యంత విలువ గల బహుమతులను అందజేసింది. అదేమీ చిన్నా చితకా బహుమతి కూడా కాదు. ఇంతకీ అదేమిటంటే..

ఇటీవల కాలంలో ఐటీ కంపెనీలు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల శ్రమను గుర్తించి, వారికి తగిన బహుమతిని అందజేస్తున్నాయి. ప్రతి సంవత్సరం పండుగల సీజన్‌ వచ్చిందంటే చాలు తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులను అందించే వ్యాపార యజమానుల గురించి అనేక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో కొన్ని సంస్థల యాజమానులు తమ కంపెనీలో అత్యుత్తమ ఉద్యోగులను ఎంపిక చేసుకుని వాహనాలను బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు. తాజాగా ఈసారి కూడా చెన్నైకి చెందిన ఒక ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు ఒకటి కాదు రెండు కాదు ఏకాంగా 50 కార్లను బహుమతిగా ఇచ్చింది. ప్రస్తుతం కార్లను గిఫ్ట్ గా అందజేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చెన్నైకి చెందిన మురళి.. ‘ఐడియాస్2ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌’ అనే ఐటీ సంస్థను 2009లో తన భార్యతో కలిసి స్థాపించారు. కాగా, కంపెనీ స్థాపించినప్పటి నుంచి అతని ఉద్యోగులు అతనికి ఎప్పుడు అండగా నిలిచేవారు. కంపెనీ కోసం ఎన్నో సవాళ్లను సైతం ఎదుర్కొని తనకు అత్యంత నమ్మకంగా ఉన్న ఉద్యోగులకు ఖరీదైన వస్తువులు బహుమతిగా ఇవ్వడం ద్వారా వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆ యజమాని ఎప్పుడు చెబుతుండేవారు. ఈ క్రమంలోనే.. కొంతమంది ఉద్యోగులకు 50 కార్లను ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ షేర్లను కూడా ఉద్యోగుల పేరుమీద బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్లు మురళి తెలిపారు. అలాగే దీర్ఘకాలిక ఉద్యోగులకు 33 శాతం షేర్లను అందజేస్తామన్నారు.

ఇక సంస్థలో ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇవ్వడం కొత్తమీ కాదానీ, గతేడాది కూడా తన సంస్థకు చెందిన ఉద్యోగులకు దాదాపు 100 కార్లను బహుమతిగా ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలా కారును బహుమతిగా పొందిన చాలా మంది ఉద్యోగులు తమ జీవితంలో అదే మొదటిసారిగా కారును కలిగి ఉన్నారని, పైగా వారిలో చాలా మంది యువకులే ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే సంస్థ యాజమాని మురళి తన ఉద్యోగులకు మారుతి సుజుకీ బ్రాండ్‌కు చెందిన అనేక కార్లను బహుమతిగా ఇచ్చినట్లు కనిపిస్తోంది. అందులో మారుతీ బాలెనో, ఇగ్నిస్, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, స్విఫ్ట్, బ్రెజ్జా, ఎర్టిగా వంటి కార్లను బహుమతిగా ఇచ్చారు. అలాగే సంస్థలో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు కూడా ఈ కార్లను బహుమతిగా ఇవ్వడం వారు చాలా భావోద్వేగానికి గురయ్యారు. మరి, సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చే యాజమానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి