SNP
Ashish Nehra, Hardik Pandya: ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు పాండ్యా విషయంలో నెహ్రా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. గిల్ గురించి మాట్లాడుతూ.. పాండ్యాను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇంతకీ నెహ్రా ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..
Ashish Nehra, Hardik Pandya: ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు పాండ్యా విషయంలో నెహ్రా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. గిల్ గురించి మాట్లాడుతూ.. పాండ్యాను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇంతకీ నెహ్రా ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా.. ఆ జట్టు మాజీ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై సెటైర్లు వేస్తూ.. అతని పరువు తీసేలా మాట్లాడాడు. తాజాగా నెహ్రా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐపీఎల్ 17వ సీజన్ ఈ నెల 22న అంటే శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్ని ప్రారంభం కానుంది. అయితే.. సీజన్ ఆరంభానికి ముందు తమ మాజీ కెప్టెన్‌పై నెహ్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ 2022 సీజన్‌తో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో టీమ్ ఎంతో స్ట్రాంగ్‌గా సెలెక్టీవ్‌గా తీసుకున్నారు. అందరిలో బెస్ట్ పిక్ చేసుకున్న టీమ్‌గా గుజరాత్ మంచి మార్కులు కొట్టేసింది. ముంబై నుంచి హార్ధిక్ పాండ్యాను, సన్‌రైజర్స్ నుంచి రషీద్ ఖాన్‌ను తీసుకుంది. వీరిలో పాండ్యాను కెప్టెన్‌గా కూడా చేసింది. తొలి సీజన్‌లో పాండ్యా తన కెప్టెన్సీలో గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. తర్వాత సీజన్‌లో కూడా రన్నరప్‌గా నిలిచింది. కానీ, ఏమైందో ఏమో కానీ, పాండ్యా అనూహ్యంగా గుజరాత్‌ను వీడి మళ్లీ ముంబైలో చేరాడు. దీంతో.. గుజరాత్ తమ కెప్టెన్‌గా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌ను ప్రకటించింది.
ఇదే విషయంపై ఆ జట్టు కోచ్ నెహ్రాను విలేకరులు ప్రశ్నించారు. గిల్ కుర్రాడు, కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు, అతనికి మీరు ఎలాంటి ఇన్‌పుట్స్ ఇస్తారని ఎదురైన ప్రశ్నకు నెహ్రా బదులిస్తూ.. గిల్ మూడు ఫార్మాట్లలోనూ అద్భుతమైన ప్లేయర్ మా వంతుగా అతన్ని మరింత ప్రమోట్ చేస్తాం. అతనికి కెప్టెన్సీ అనుభవం లేదు నిజమే, కానీ, మొదట అతన్ని ఒక మంచి మనిషిగా ఉండేలా ప్రొత్సహిస్తాం, తర్వాతే కెప్టెన్‌గా ఎలాం ఉండాలో చెప్తాం. ఒక మంచి మనిషిగా ఉంటే, అతనే మంచి కెప్టెన్ అవుతాడు. ఐపీఎల్ 2022 సీజన్ కంటే ముందు పాండ్యా కూడా కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు అంటూ పాండ్యాను ప్రస్తవించిన నెహ్రా.. అతన్ని కెప్టెన్‌గా తామే తీర్చిదిద్దామని, గిల్ ఒక మంచి మనిషిగా ఉండాలని కోరుకుంటూ పరోక్షంగా పాండ్యాకు చురకలు అంటించినట్లు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ashish Nehra “As a new Captain,I want to see how Shubman Gill operates & not just me,the whole of India would like to see.We as a franchise would like to help him grow more as a person than as a captain.If he grows as a person then he will grow as Captain”pic.twitter.com/iggdtSzILj
— Sujeet Suman (@sujeetsuman1991) March 16, 2024