iDreamPost

అబ్బాస్ పక్కన ఉన్న ఈ పిల్లాడు.. ఇప్పడు టాప్ హీరో

ఇటీవల కాలంలో థ్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తున్న సంగతి విదితమే. నటీ నటులే తమ చిన్నప్పటి పిక్స్ షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ నటుడు.. పిల్లవాడితో ఉన్న పిక్ షేర్ చేస్తూ.. ఎవరో చెప్పుకోండి అంటూ ఫజిల్ విసిరాడు.

ఇటీవల కాలంలో థ్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తున్న సంగతి విదితమే. నటీ నటులే తమ చిన్నప్పటి పిక్స్ షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ నటుడు.. పిల్లవాడితో ఉన్న పిక్ షేర్ చేస్తూ.. ఎవరో చెప్పుకోండి అంటూ ఫజిల్ విసిరాడు.

అబ్బాస్ పక్కన ఉన్న ఈ పిల్లాడు.. ఇప్పడు టాప్ హీరో

ప్రేమ దేశం మూవీతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు అబ్బాస్. 90వ దశకం మూవీస్‌లో అతడో లవర్ బాయ్. అతడి లుకింగ్, యాక్టింగ్‌కు అప్పటి యూత్ ఫిదా అయ్యేవారు. 50పైగా సినిమాల్లో కనిపించిన అబ్బాస్‌కు హీరోగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. హీరోగా అవకాశాలు తగ్గినప్పుడు విలన్‌గానూ మెరిశాడు. తెలుగులో ప్రియా ఓ ప్రియాతో తెరగేట్రం చేసిన ఈ అందగాడు.. తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీస్‌లో పనిచేశాడు. విలన్, సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ వచ్చారు. హార్పిక్ వంటి యాడ్స్‌లో కనిపించి విమర్శలు ఎదుర్కొన్నారు. సినిమాలు తగ్గడంతో 2015 తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. ఇన్నాళ్ల తర్వాత ఇటీవల ఇండియాకు వచ్చి ఇంటర్వ్యూలల్లో పలు అంశాలను పంచుకున్న సంగతి విదితమే.

త్వరలోనే అబ్బాస్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమౌతున్నారు. ఇదిలా ఉంటే ఆయన ఓ ఇంట్రస్టింగ్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అదే ఆ పై ఫోటో. ఓ బుడ్డోడితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. నాతో పాటు కూర్చున్న ఈ పిల్లాడు ఎవరో గుర్తుపట్టండి.. అతడు ఇప్పుడు ఓ యాక్టర్ కూడా అంటూ ఫజిల్ వదిలారు. ఆ పిల్లోడిపై చేయి వేస్తూ .. చిరునవ్వులు చిందిస్తున్న పిక్ అది. ఇంతకు ఆ నటుడు ఎవరంటే.. ప్రముఖ హీరో జై. జర్నీ మూవీతో తెలుగువారందరికి సుపరిచతమే. ఈ ఫోటోను చూసిన జై సైతం కామెంట్ చేశాడు. వావ్ అంటూ.. ఈ పిక్ తీసుకోవడానికి తోటి పిల్లల గుంపుతో నేను పోటీ పడిన సందర్భం తనకు ఇంకా గుర్తు ఉందని, ఇది సోషల్ మీడియాలో చూడటం నమ్మశక్యం లేదని అన్నారు.

ఈ పిక్‌ను షేర్ చేసినందుకు, ఆ జ్ఞాపకాన్ని తిరిగి అందించినందుకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. అయితే అబ్బాస్ ఆ కామెంట్‌కు రిప్లై ఇచ్చారు. ఎలా ఉన్నావ్ జై.. నిన్ను మిస్ అవుతున్నా అంటూ రాసుకొచ్చారు. ఇక జై విషయానికి వస్తే తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా.. ఇక్కడ కాస్తో,కూస్తో ఫ్యాన్స్ ఉన్నారు. అనంతరపురం, గోవా, రాజా రాణి, లవ్ జర్నీ, ఇంట్లో ఇల్లాలు.. ఆఫీసులో ప్రియురాలు, నాగ కన్య, ఖిలాడీ వంటి తమిళ డబ్బింగ్ మూవీస్ ద్వారా ఇక్కడ ప్రజాదరణ పొందాడు. ప్రస్తుతం మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఓటీటీలోకి అడుగుపెట్టి.. పలు సిరీస్‌లో మెరిశాడు. మరీ జై సినిమాల్లో మీకు ఏదీ నచ్చుతుందో కామెంట్లో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి