iDreamPost

గుడివాడలో మళ్ళీ కొడాలి నానిదే విజయం! అభ్యర్థి ప్రకటనతో మారిన లెక్క!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జన సేన పొత్తు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేశాయి. అయితే అందరి చూపు గుడివాడ వైపు పడింది. టీడీపీ ఈ నియోజకవర్గంలో..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జన సేన పొత్తు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేశాయి. అయితే అందరి చూపు గుడివాడ వైపు పడింది. టీడీపీ ఈ నియోజకవర్గంలో..

గుడివాడలో మళ్ళీ కొడాలి నానిదే విజయం! అభ్యర్థి ప్రకటనతో మారిన లెక్క!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారానే ఇంకా మోగనే లేదు.. కానీ రాజకీయాలు అప్పుడే వేడెక్కుతున్నాయి. ఏపీలో అధికార పార్టీ వైసీపీని దించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. వచ్చే ఎన్నికల్లో చంద్ర బాబు నేతృత్వంలోని టీడీపీ, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జన సేన పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న సంగతి విదితమే.ఈ నేపథ్యంలో కొన్ని నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఉమ్మడిగా విడుదల చేశారు ఇరు పార్టీ అధినేతలు. పొత్తులో భాగంగా ఏ నియోజక వర్గాల్లో ఎవరు పోటీ చేస్తారో అనే ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా చాలా మంది చూపు గుడివాడ మీద పడింది. ఒక్కప్పటి టీడీపీ కంచుకోట అయిన ఈ నియోజకవర్గం.. గత రెండు పర్యాయాలు వైసీపీ హస్తగతం అయ్యింది. తిరిగి ఈ స్థానాన్ని దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది సైకిల్ పార్టీ.

గుడివాడ నియోజకవర్గం అనగానే.. ముందుగా గుర్తుకు వచ్చే పేరు కొడాలి నాని. 2004 నుండి ఎమ్మెల్యేగా, తిరుగులేని నేతగా ఆ నియోజక వర్గంలో పాతుకుపోయిన కొడాలి నానిపై పోటీకి ఎవరిని దింపుతారా అన్న ఆసక్తి నెలకొంది. చివరకు గుడివాడ టీడీపీ ఇన్ చార్జ్ వెనిగండ్ల రాము పేరును ఖరారు చేశారు. సాధారణంగా కొడాలి నాని అక్కడి ప్రజల్లో విశేషమైన ఆదరణ కల్గిన నేత. ఆయన టీడీపీలోనే కాదూ పార్టీ మారి వైసీపీలోకి వెళ్లినా కూడా ఆయనకు ప్రజలు ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టారు. ఎందుకంటే.. గుడివాడ అభివృద్ధికి విశేష సేవలందించడంతో పాటు.. ప్రజలతో మమేకమైన నేత కావడంతో 2004 నుండి 2019 వరకు ఆయనకే పట్టం కట్టారు.

నాలుగు పర్యాయాలు ఆయన్ను ఎమ్మెల్యేగా గుడివాడ ప్రజలు గెలిపించారంటే.. ఆయనపై వారికున్న నమ్మకమే. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలు వింటూ.. అక్కడ ప్రాంతానికి అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారు. అక్కడ ఆయన తప్ప మరో బలమైన నాయకుడు లేరని దీన్ని బట్టే అర్థమౌతుంది. అక్కడ ఆయనకు క్యాడర్ కూడా బలంగా ఉంది. వైసీపీలో టీడీపీ గురించి,ఆ నేతల గురించి బాగా తెలిసిన వ్యక్తి కావడమే కాదూ.. అధికార పక్షంపై చేస్తున్న విమర్శలను.. ధీటుగా సమాధానం ఇచ్చే ఏకైక నేత ఆయనే కావడం కాదనలేని సత్యం. గుడివాడలో ఆయన్ను తలదన్నే నేత  లేడు అనడంలో సందేహం లేదు. అలాంటి వ్యక్తిని ఢీ కొట్టేందుకు కొత్త వ్యక్తికి సీటు ఇచ్చింది టీడీపీ.

ఇంతకు కొడాలి నానిపై పోటీ చేయబోతున్న టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఎవరంటే.. ఆయనొక ఎన్నారై. గత ఏడాది జనవరిలో పార్టీలో చేరిన ఆయన.. అక్కడ వెనిగళ్ల ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కొడాలి నాని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. అయితే ఇక్కడ టీడీపీ వ్యూహం మరోలా ఉంది. వెనిగండ్ల రాము భార్య మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. రెండు కులాల ఓట్లను టార్గెట్ చేసే ఉద్దేశంతో టీడీపీ అతడ్ని రంగంలోకి దింపింది. అయితే రెండు దశాబ్దాల పాటు ఓటమి ఎరుగని నాయకుడిగా మారిన కొడాలి నానిపై.. టీడీపీ అన్న ట్యాగ్ తప్ప.. ఆయనకుంటూ సొంత క్యాడర్ లేని రాము పోటీ చేయడం చూస్తుంటే.. వార్ వన్ సైడ్ డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. టీడీపీ కార్యకర్తలు, నేతలతోనే ఆయన ప్రచారం చేసి… ఎన్నికల్లో గెలుపొందాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే కొడాలి నాని విజయం.. నల్లేరుపై నడక చందంగా మారే అవకాశాలు స్వయంగా టీడీపీయే ఇచ్చినట్లు అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి