iDreamPost
android-app
ios-app

IPL 2024 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అతడే.. ఇందులో నో డౌట్: సౌతాఫ్రికా దిగ్గజం

  • Published May 06, 2024 | 7:13 PM Updated Updated May 06, 2024 | 7:13 PM

IPL 2024 సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును ఆ స్టార్ ప్లేయరే గెలుచుకుంటాడని, ఇందులో ఎలాంటి డౌట్ లేదని సౌతాఫ్రికా దిగ్గజం, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అన్నాడు. మరి ఆ ఆటగాడు ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024 సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును ఆ స్టార్ ప్లేయరే గెలుచుకుంటాడని, ఇందులో ఎలాంటి డౌట్ లేదని సౌతాఫ్రికా దిగ్గజం, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అన్నాడు. మరి ఆ ఆటగాడు ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అతడే.. ఇందులో నో డౌట్: సౌతాఫ్రికా దిగ్గజం

IPL 2024 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ కోసం టీమ్స్ హోరాహోరీగా కొట్టుకుంటున్నాయి. కోల్ కత్తా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ టీమ్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ కు వెళ్లిపోయాయి. మిగతా రెండు స్థానాల కోసం చెన్నై, సన్ రైజర్స్, ఢిల్లీ, లక్నో టీమ్స్ పోటీపడుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సీజన్ లో బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. బౌలర్ల భరతం పడుతూ.. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతున్నారు. ఇక ఐపీఎల్ 2024 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును గెలుచుకునేది ఆ స్టార్ ప్లేయరే అని, అందులో నో డౌట్ అంటూ జోస్యం చెప్పాడు సౌతాఫ్రికా దిగ్గజం గ్రేమ్ స్మిత్. మరి ఆ ఆటగాడు ఎవరు?

ఐపీఎల్ 2024 సీజన్ లో పరుగుల వరదపారిస్తున్నాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. అతడు ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ ల్లో 542 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. ఇక అత్యధిక వికెట్లు(17) తీసి పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్. మ్యాచ్ లు ప్లే ఆఫ్స్ దగ్గరికి రావడంతో.. ఈ సీజన్ లో ఎవరు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుస్తారు? అన్న ప్రశ్న అందరిలో ఆసక్తినిరేకెత్తిస్తోంది. అయితే ఈ సీజన్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డ్ ను గెలిచేది అతడే అంటూ.. కేకేఆర్ స్టార్ బ్యాటర్ సునీల్ నరైన్ పేరును చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా దిగ్గజ ప్లేయర్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్.

“లక్నోతో జరిగిన మ్యాచ్ లో సునీల్ నరైన్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అయితే అతడిని ఔట్ చేయడానికి లక్నో బౌలర్లు ఎలాంటి వ్యూహాలతో వచ్చినట్లుగా మ్యాచ్ లో కనిపించలేదు. దాంతో నరైన్ గ్రౌండ్ నలువైపులా సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయాడు. అతడు ఒక్కసారి క్రీజ్ లో నిలదొక్కుకుంటే.. బౌలర్లకు కష్టమే. ఆ విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ సీజన్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును కచ్చితంగా సునీల్ నరైన్ గెలుచుకుంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు.  నరైన్ ఆటతీరే ఇందుకు నిదర్శనం” అంటూ అతడిని ఆకాశానికి ఎత్తేశాడు. ఇక ఈ సీజన్ లో నరైన్ ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడి 461 పరుగులు చేశాడు. 183.67 స్ట్రైక్ రేట్ తో నరైన్ బ్యాటింగ్ చేయడం విశేషం. ప్రస్తుతం టోర్నీ లీడింగ్ స్కోరర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ విండీస్ మాజీ వీరుడు. మరి గ్రేమ్ స్మిత్ అన్నట్లుగానే నరైన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.