iDreamPost

కరోనా కట్టడికి ఆరోగ్య సేతు యాప్ విడుదల చేసిన భారత ప్రభుత్వం

కరోనా కట్టడికి ఆరోగ్య సేతు యాప్ విడుదల చేసిన భారత ప్రభుత్వం

ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారిలా ఆవహించి ప్రజలను హరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి భారత ప్రభుత్వం అనేక నిర్ణయాలను చేపట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి దేశ ప్రజలను స్వీయ నిర్భంధం పాటించమని సూచించింది. కరోనా లక్షణాలతో ఎవరైనా డాక్టర్లని సంప్రదిస్తే సదరు రోగితో పాటు వారి కుటుంబ సభ్యులను సైతం క్వారంటయిన్లో పెట్టి వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తుంది. దేశ వ్యాప్తంగా పోలీసులు డాక్టర్లు పారిశుధ్య కార్మికులు ఈ మహమ్మారిని పారతోలడానికి కంటిమీద కునుకు లేకుండా పని చేస్తున్నారు. ఎన్ని చేసినా వ్యాది గ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రజల్లో మరింత అవగాహన పెంచి అప్రమత్తం చేయడానికి ఒక సరికొత్త యాప్ ని ప్రవేశపెట్టింది.

భారత దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి సహయపడే విధంగా భారత్ ప్రభుత్వం దాదాపుగా 11 భాషల్లో ఆరోగ్య సేతు పేరుతో యాప్ ని విడుదల చేసింది. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లొకేషన్ స్విచ్ ఆన్ చేసుకుని, లోకేషన్ షేరింగ్ సెట్టింగ్ చేసుకుంటే కరోనా వైరస్ పరిక్షల్లో పాజిటివ్ గా నిర్ధారింపబడిన వారితో మీ ఇంటరాక్షన్ను, బ్లూటూత్ మరియు లోకేషన్ జనరేటెడ్ సోషల్ గ్రాఫ్ ద్వారా ట్రాక్ చెస్తుంది. కరోనా పరిక్షల్లో పాజిటివ్ గా నిర్ధారింపబడిన వారు సంచరించిన ప్రాంతాల్లో సామాన్యులు సంచరిస్తే వెంటనే ఆ విషయాన్ని సదరు వ్యక్తికి అలర్ట్ సిగ్నల్ ద్వారా తెలియచేయడంతో పాటు స్వీయ నిర్భందం లో ఉండటం ఎలానో, మీలో వైరస్ లక్షణాలు వృద్ది చెందితే అవసరమైన సహాయం మద్దతు ఎలా పొందాలో తగిన సూచనలు ఇస్తుందని ఈ యాప్ వాడటం వలన మీతో పాటు మీ కుటుంభాన్ని మరియు స్నేహితులని ఈ వైరస్ బారిన పడకుండా రక్షించుకునేందుకు సులువైన మార్గం అని తెలియచేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి