iDreamPost

చదువుకుంటూనే చికెన్‌ షాప్‌లో పని! ఇంటర్‌ ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ కళాశాల విద్యార్థి

విజయం సాధించాలనే తపన ఉండాలే కానీ ఏ కష్టాలు అవరోధాలుగా కాదు. కేవలం సాకులు చెప్పే వారికి మాత్రమే అవి వర్తిస్తాయి. కొందరు కష్టాల కడలిలో ఈదుతూ విజయ తీరాలకి చేరి.. అందరికి ఆదర్శంగా నిలుస్తారు. అలానే శుక్రవారం విడుదలైన ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఓ పేద విద్యార్థి మెరిశాడు.

విజయం సాధించాలనే తపన ఉండాలే కానీ ఏ కష్టాలు అవరోధాలుగా కాదు. కేవలం సాకులు చెప్పే వారికి మాత్రమే అవి వర్తిస్తాయి. కొందరు కష్టాల కడలిలో ఈదుతూ విజయ తీరాలకి చేరి.. అందరికి ఆదర్శంగా నిలుస్తారు. అలానే శుక్రవారం విడుదలైన ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఓ పేద విద్యార్థి మెరిశాడు.

చదువుకుంటూనే చికెన్‌ షాప్‌లో పని! ఇంటర్‌ ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ కళాశాల విద్యార్థి

ప్రతి మనిషికి జీవితంలో లక్ష్యం అంటూ ఉంటుంది.  ఈ గమ్యాన్ని చేరుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. కొందరు మాత్రం తమకు ఉండే అనేక రకాల సమస్యలతో లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు.  కానీ మరికొందరు మాత్రం అనుకున్నది సాధించేందుకు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటారు. అలా పోరాడే వారి కోసం వారి కుటుంబ సభ్యులు సైతం సపోర్టు చేస్తుంటారు. చివరకు విజయం సాధించి..ప్రపంచం తనవైపు చూసేలా చేస్తారు. అచ్చం అలానే కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇంటర్ ఫలితాల్లో రికార్డు సృష్టించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మిగనూరు పట్టణంలోని జావీద్ అనే యువకుడు..తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. జావీద్ ది నిరుపేద కుటుంబం. ఇతడి తల్లిదండ్రులు కటిక బషీర్, కటిక ఖాజు దంపతులకు నలుగురు సంతానం. అందులో రెండవ కుమారుడు జావీద్. అతడు శుక్రవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో 961 మార్కులు సాధించి నేటితరం విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. జావీద్ తండ్రి వృత్తి రీత్యా కార్పెంటర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

Chicken shop boy

అయితే నలుగురు సంతానం కావడంతో చదవించే స్థోమత లేకపోయింది. దీంతో తండ్రి కష్టం చూసిన పెద్ద కుమారుడు కమల్ బాషా 5వ తరగతి వరకు చదువుకుని..అక్కడితే స్కూల్ వెళ్లడం మానేశాడు. కూలి పనులు చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడే వాడు. అయితే తన తమ్ముడు కూడా తనలాగా ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేయకూడదని భావించాడు. దీంతో కమల్ భాష.. కష్టపడి కర్నూలు టౌన్ లోని ఒక చిన్న రేకుల షెడ్లో చికెన్ షాప్ నిర్వహిస్తూ తమ్ముడిని చదివిస్తున్నాడు.

ఇద్దరూ కుటుంబానికి దూరంగా ఉంటూనే చికెన్ షాప్ నిర్వహిస్తున్నారు. అన్నకు చికెన్షాపు విషయంలో జావీద్ సహయ పడుతుండే వాడు. ఆ షాపులోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. జావీద్ చికెన్ షాపులోనే ఉంటూ కర్నూలు పట్టణంలో ఉన్న ఆదర్శ పాఠశాలలో చదివి 10వ తరగతిలో 520 మార్కులు సాధించాడు. ఇక సోదరుడు కమల్ బాషా ప్రోత్సహంతో ఇంటర్ అదే కళాశాలలో చేరి ఎంపీసీ తీసుకున్నాడు. అన్న, కుటుంబం పడుతున్న ఆర్థిక సమస్యలను నిరంతరం గుర్తు చేసుకుంటూ తన చదువును సాగించాడు. ఎక్కడ చదువు విషయంలో నిర్లక్ష్యం చేయలేదు.

చికెన్ షాపులోనే ఉంటూ రోజూ కాలేజీకి వెళ్లివస్తుండేవాడు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో 1000 మార్కులకు గాను 961 మార్కులతో కాలేజీ టాపర్ గా నిలిచాడు. అన్నయ్య కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఈ ఫలితాలను సాధించాని జావీద్ తెలిపాడు. లక్షల ఫీజులు కట్టిస్తున్న చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండే విద్యార్థులు, కష్టాలు ఉన్నాయని చదువుపై ఆసక్తి చూపించిని విద్యార్థులు జావీద్ ను స్పూర్తిగా తీసుకోవాలి. జావీద్ పై స్థానిక ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి.. పేదరికంలో నుంచి మెరిసిన ఈ ఆణిముత్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి