iDreamPost
android-app
ios-app

రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన గూడ్స్ రైలు

మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలును ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది.

మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలును ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది.

రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన గూడ్స్ రైలు

సామాన్యుడి విమాన ప్రయాణంగా భావించే రైలుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ట్రైన్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండడం సమయం ఆదా అవుతుండడంతో ట్రైన్ జర్నీ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా పంజాబ్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్నాయి. ప్యాసింజర్ రైలును గూడ్స్ రైలు ఢీకొట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పంజాబ్ లోని ఫతేఘడ్ సాహెబ్ లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటన భయాందోళనకు గురిచేసింది. ఆదివారం తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో వణికిపోయారు. అమృత్ సర్-ఢిల్లీ రైల్వే లైన్ లో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గతేడాది ఒడిషాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో వందలాది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రమాదాల నివారణకు రైల్వే డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలను నివారించలేకపోతున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్, మానవ తప్పిదాల కారణంగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైళ్లలో మంటలు చెలరేగడం, పట్టాలు తప్పడం, రైళ్లు ఢీకొనడం వంటి కారణాలతో రైలు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రయాణికులు గాయాలపాలవ్వడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తుంది. రైలు ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ చర్యలు చేపట్టాలని భారతీయ రైల్వేను ప్రయాణికులు కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి