iDreamPost

టన్నెల్ ప్రమాదం: 17 రోజులకు శుభవార్త! అమ్మ, నాన్న ముఖాల్లో ఆనందం!

ఉత్తరకాశీ లోని సిల్ క్వారా ప్రాంతంలోని సొరంగం కూలిపోయిన సంగతి తెలిసిందే. అందులో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారి గురించి దాదాపు 17 రోజుల తరువాత ఓ శుభవార్త బయటకు వచ్చింది. దీంతో బాధితుల తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది.

ఉత్తరకాశీ లోని సిల్ క్వారా ప్రాంతంలోని సొరంగం కూలిపోయిన సంగతి తెలిసిందే. అందులో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారి గురించి దాదాపు 17 రోజుల తరువాత ఓ శుభవార్త బయటకు వచ్చింది. దీంతో బాధితుల తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది.

టన్నెల్ ప్రమాదం: 17 రోజులకు శుభవార్త! అమ్మ, నాన్న ముఖాల్లో ఆనందం!

నవంబర్ 12న ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్ క్వారా సొరంగం కూలిపోయిన సంగతి తెలిసిందే. అందులో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు శరవేగంగా సాగుతున్నాయి.  దాదాపు 16 రోజుల పాటు వారు సొరంగంలోనే చిక్కుకుని ఉన్నారు.  చాలా రోజుల తరువాత ఉత్తరకాశీ నుంచి శుభవార్త వచ్చింది. టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు ఎలుక మైనర్ల బృందం మాన్యువల్ డ్రిల్లింగ్ పూర్తి చేసింది. పైప్ కార్మికుల సమీపానికి చేరింది. దీంతో ఆ 41 మంది కార్మికులు మరికొద్ది గంటల్లో బయటకు వస్తారని తెలుస్తోంది. ఈ వార్త తెలియగానే బాధితుల్లోని ఒకరైన మంజీత్ తల్లి కళ్లలో  కన్నీరు ఉప్పొంగాయి.

ఉత్తరాఖండ్ లోని కాశీ ప్రాంతంలో సిల్ క్వారా సొరంగం 150 మీటర్ల మేర కుప్పకూలింది.  ఈ ఘటన జరిగి దాదాపు 16 రోజులు కావస్తోన్నా కార్మికులు లోపలే ఉన్నారు. అయితే చాలా రోజుల తరువాత కార్మికులకు సంబంధించిన ఓ శుభవార్త బయటకు వచ్చింది. గతంలో నేలకు సమాంతరంగా తొలుత చేపట్టిన పనులు ఆగిపోయిన చోట నుంచి 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు డ్రిల్లింగ్ చేపట్టి మిగతా దూరం పూర్తి చేశారు. ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రదేశం వరకు గొట్టాన్ని పంపించారు. వారికి  రెండు మీటర్ల దూరంలో డిగ్గింగ్ పనులు మిగిలి ఉన్నాయని, అది పూర్తైన వెంటనే ఎన్డీఆర్ఎప్ సిబ్బంది సొరంగం లోపలికి వెళ్తారని పేర్కొన్నారు.

లోపల ఉన్న కార్మికులను ఒక్కొక్కరిని తీసుకొచ్చేందుకు 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది. మరికొద్ది గంటల్లో వారిని బయటకు తీసుకొస్తారనే శుభవార్త బయటకు వచ్చింది. ఈ వార్త తెలియగానే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలోని భైరంపూర్ గ్రామానికి చెందిన మంజీత్ తల్లి కళ్లలో వెలుగులు కనిపించాయి. ఒక్కసారిగా ఆమె కళ్లు చెల్లుమని కన్నీరు ఉబికి వచ్చాయి. దాదాపు 17 రోజులుగా కొడుకు కోసం ఆ మాతృమూర్తి ఎంతో ఆతృతగా  ఎదురుచూస్తోంది. ఇక మంజీత్ తండ్రి చౌదరి ఉత్తరకాశీలోనే  ఉన్నాడు.  సొరంగం కూలిన రెండో రోజే.. మంజీత్ తండ్రి ఉత్తరకాశీకి వెళ్లారు.

సొరంగంలో చిక్కుకున్న మంజీత్ కుటుంబం బెల్రాయ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలోని అడవి అంచున ఉన్న భైరంపూర్ గ్రామంలో నివాసం ఉంటుంది. అతని తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెలు, ముసలి తాత.. అందరూ ఆ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు.  కుటుంబాన్ని పోషించేందుకు మంజీత్ ఉత్తర కాశీకి  కూలీ పని చేసేందుకు వెళ్లాడు. అక్కడే సొరంగం టన్నెల్ గతం కొన్నేళ్లుగా  పని చేస్తున్నాడు.

దీపావళికి మంజీత్ ను ఇంటికి రావాలని అతడి తల్లి కోరింది. కానీ పలు కారణాలతో అతడు పండగకు ఇంటికి వెళ్లలేకపోయాడు. ఆ వెంటనే సొరంగం కుప్పకూలిన ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. తమ కుమారుడు ఎలా ఉన్నాడో అనేది గత 15 రోజులుగా వేదన చెందుతున్నారు. ఈ ఘటన జరిగిన రెండో రోజే మంజీత్ తండ్రి చౌదరి ఉత్తరకాశీ వెళ్లాడు.

ఇక మంగళవారం ఉదయం సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకు రావచ్చనే సమాచారం వచ్చింది. ఈ వార్త అందగానే కొడుకు కోసం మౌనంగా ఎదురు చూస్తూ కూర్చున్న ఆ తల్లిదండ్రుల ముఖాలు వెలిగిపోయాయి. సహాయ చర్యల్లో నిమగ్నమైన యంత్రాలు ఆగిపోయినప్పుడు, జీవితం ఆగిపోయినట్లు అనిపించిందని మంజీత్ తల్లి పేర్కొన్నారు. తాజాగా ఈ వార్తతో ఇప్పుడు ఆమె ప్రాణం తిరిగి వచ్చినట్లైయింది. తన కొడుకుతో సహా 41 మంది కార్మికులు క్షేమంగా బయటకు రావాలని ప్రతి క్షణం దేవుడిని వేడుకుంటుంది.

ఇక మంజీత్ ఇంటికి వస్తాడనే వార్త తెలియగానే అతడి సోదరీమణులు, తాత సంతోషం వ్యక్తం చేశారు. తమ సోదరుడి రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని మంజీత్ సిస్టర్ తెలిపారు.  మంజీత్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతనికి బాయీ దూజ్ ప్రసాదాన్ని తినిపిస్తారట. ఇలా చాలా రోజుల తరువాత టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. మరి.. ఈ ఎమోషనల్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి