iDreamPost

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఏకంగా 10 రోజుల పాటు..!

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో గుడ్ న్యూస్ ను చెప్పింది. శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారికి ఇది మంచి సమయం అని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే?

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో గుడ్ న్యూస్ ను చెప్పింది. శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారికి ఇది మంచి సమయం అని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే?

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఏకంగా 10 రోజుల పాటు..!

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తుంటారు. ఒక రోజులో దాదాపు కొన్నిలక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటుంటారు. అయితే ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తాజాగా మరో శుభవార్త చెప్పింది. శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారికి ఇది మంచి సమయం అని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. అసలు శ్రీవారి భక్తులకు టీటీడీ చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటి? దాదాపు 10 రోజుల పాటు ఏం జరగనుందనే పూర్తి వివరాలు మీ కోసం.

అసలు విషయం ఏంటంటే? తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మంచి శుభవార్తను చెప్పింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే నెలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 23వ తేదీ నుంచి వచ్చే జనవరి 1 వరకు ఉంటుందని టీటీడీ తెలిపింది. ఏకంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన 2.25 లక్షల టికెట్లు నవంబర్ 10 నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని కూడా తెలిపింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని టీటీడీ తెలిపింది. ఇక ఇంతే కాకుండా డిసెంబర్ 22న వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 4.25 లక్షల టైంస్లాట్ సర్వ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి