iDreamPost

TTD: ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో TTD కీలక నిర్ణయం!

నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నో రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎలక్షన్ పై శనివారం కీలక ప్రకటన రానుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నో రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎలక్షన్ పై శనివారం కీలక ప్రకటన రానుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

TTD: ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో TTD కీలక నిర్ణయం!

శనివారం కేంద్ర ఎన్నికల సంఘటం లోక్ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అందరూ ఈ షెడ్యూల్ ఎలా ఉంటుందా అని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనంకు సంబంధించిన విషయంలో టీటీడీ కీలక నిర్ణయాన్ని భక్తులకు తెలియజేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కలియుగ దైవం తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది తిరుపతికి వస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు  తిరుమల కొండకు క్యూ కడుతుంటారు. ఇలా స్వామి దర్శనం కోసం సామాన్య భక్తుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమలకు పోటెత్తుతారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీవారి దర్శనంకు వివిధ రకాల టోకెన్లు ఉన్నాయి. సర్వదర్శనం, స్పెషల్ దర్శనం,   వీఐపీ బ్రేక్‌ దర్శనం వంటివి వాటి ద్వారా వెంకన్నను దర్శనం చేసుకుంటారు.  అయితే తాజాగా ఈ దర్శనాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.  వీఐపీ బ్రేక్ దర్శనాలకు టీటీడీ నిలిపివేసింది.

TTD's key decision on Srivari Darshan

ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో తిరుమలకు రాజకీయ ప్రముఖులు క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపి వేశారు. సాధారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న వ్యక్తులు, ప్రముఖులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పొలిటికల్ లీడర్స్, వారి కుటుంబ సభ్యులు, అనుచరులతో వీఐపీ బ్రేక్, శ్రీవారి ఆర్జిత నిత్య సేవల్లో పాల్గొంటూ ఉంటారు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులు, వారి అనుచర వర్గానికి, నియోజకవర్గాల ప్రజలకు సిఫార్సు లేఖలపై తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందుతుంటారు.

ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రతి రోజు ఉదయం సమయంలో ఉంటుంటాయి. వీఐపీల నుంచి తీసుకుని వెళ్లే సిఫార్సు లేఖలను భక్తులు ముందు రోజు తిరుమలలోని అడిషనల్ ఈవో ఆఫీస్ లో దర్శనం కోసం దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.  అనంతరం టీటీడీ అధికారులు దర్శన రద్దీ ని దృష్టిలో పెట్టుకుని దర్శనాలకు స్లాట్‌లు కేటాయిస్తారు. అయితే.. త్వరలోనే ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. దాంతో.. నేటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

TTD's key decision on Srivari Darshan

ఆ మేరకు రాజకీయ ప్రముఖులకు ఇప్పటికే సమాచారం అందించింది టీటీడీ. శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరణను రద్దు చేసింది టీటీడీ. సిఫార్సు లేఖలు అనుమతించనప్పటికీ.. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు మాత్రం బ్రేక్ దర్శనం కల్పిస్తారు. మొత్తంగా టీటీడీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి