iDreamPost

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో బస చేయడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే, ఈ క్రమంలోనే టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయం ఏంటి? అసలు విషయం ఏంటనే పూర్తి వివరాలు మీ కోసం.

రోజు రోజుకు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. దీంతో అక్కడ భక్తుల తాకిడి పెరిగిపోతోంది. దీంతో అక్కడ వసతి సమస్యను అధిగమించడానికి టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేవుడి దర్శనానికి వచ్చిన భక్తుల ఇబ్బందులను, భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని విశాఖకు చెందిన ఓ భక్తుడి సహకారంతో టీటీడీ మోబైల్ కంటైనర్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల వీటి పనులు పూర్తి కావడంతో శుక్రవారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు పలువురు ఈ మొబైల్ కంటైనర్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విశాఖకు చెందిన దాత అందించిన ఈ కంటైనర్ లో భక్తులు బస చేసేందుకు వీలుగా ఉన్నాయని, ఇందులో స్నానపు గదులు, మరుగు దొడ్లు, పరుపులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కంటైనర్ల విలువ దాదాపు రూ.25 లక్షలు వరకు ఉంటుందని సుబ్బారెడ్డి తెలిపారు. ఇలాంటివి భవిష్యత్ లో భక్తులకు మరిన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు టీటీడీ ట్రాన్స్ పోర్ట్ జనరల్ మేనేజర్, డీఐ, టెక్నికల్ ఆఫీసర్ మొబైల్ కంటైనర్ల దాత పలువురు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో IASల బదిలీలు..ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి