iDreamPost

వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక విదేశాల్లోనూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు

వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక విదేశాల్లోనూ ప్రాక్టీస్  చేసుకోవచ్చు

భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో వైద్య విద్యను అభ్యసించి పట్టభద్రులైన విద్యార్థులు ఇప్పుడు విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయవచ్చునని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేష్ (డబ్ల్యుఎఫ్ఎంఇ) నుండి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసి)కి 10 ఏళ్ల కాల పరిమితి లభించింది. దీంతో విదేశాల్లో మెడిసన్‌లో పీజీతో పాటు ప్రాక్టీస్ చేసుకోవచ్చునని తెలిపింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో వైద్య విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. భారత్‌లో మొత్తం 706 మెడికల్ కాలేజీలు డబ్ల్యుఎఫ్ఎంఇ అక్రిడిటేషన్ హోదాను పొందుతాయి.

రాబోయే పదేళ్లలో ఏర్పాటు చేసే నూతన వైద్య కళాశాలలకు కూడా గుర్తింపు వర్తిస్తుందని పేర్కొంది. జాతీయ మండలి.. డబ్ల్యుఎఫ్ఎంఇ గుర్తింపు పొందడం వల్ల భారత్‌లో వైద్య విద్య నాణ్యత, ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. ఈ గుర్తింపు వల్ల ఇక్కడి వైద్య నిపుణులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు ఖ్యాతి, నిరంత అభివృద్ధి, ఆవిష్కరణలకు సహకరిస్తుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన వైద్య విద్యను అందించేందుకు వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ విశేషంగా కృషి చేస్తోందని పేర్కొంది. వైద్య విద్యలో అత్యున్నత శాస్త్రీయ ప్రమాణాలతో పాటు నైతిక ప్రమాణాలను మెరుగుపరచడం దీని ప్రాథమిక లక్ష్యం.

డబ్ల్యుఎఫ్ఎంఇ గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఒక్కో మెడికల్ కాలేజీ రూ. 60 వేల డాలర్లు( భారత కరెన్సీలో రూ.49,85,142) వసూలు చేస్తోంది. ఈ లెక్కన దేశంలో ఉన్న 706 వైద్య కళాశాలలను పరిగణలోని తీసుకుంటే.. అవి డబ్ల్యుఎఫ్ఎంఇ గుర్తింపు పొందేందుకు అయ్యే ఖర్చు మొత్తం దాదాపు రూ. 351.9 కోట్లు ఉంటుంది. ఈ గుర్తింపు ఎన్ఎంసి పరిధిలోని వైద్య కళాశాలలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ విజయం భారతీయ వైద్య విద్య అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన ముందడుగుగా చూడవచ్చునని కేంద్రం పేర్కొంది. వైద్య విద్యలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విద్యార్థులు.. విదేశాల్లో ప్రాక్టీస్ చేసే అవకాశాలను మెరుగుపరుస్తుందని, ఆరోగ్య సంరక్షణ విద్య నాణ్యత పెరుగుతుందని తెలిపింది.ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇంటర్నేషనల్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌(ఐఎంజీ)కు లైసెన్స్‌లు ఇచ్చే పాలసీలు, నిబంధనలను అమెరికాలోని ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆన్‌ ఫారిన్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌( ఈసీఎఫ్ఎంజీ) పర్యవేక్షిస్తుందని తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి