iDreamPost

Ghatothkachudu : హీరోయిన్ ని ప్రేమించే రోబో కాన్సెప్ట్ మనదే – Nostalgia

Ghatothkachudu : హీరోయిన్ ని ప్రేమించే రోబో కాన్సెప్ట్ మనదే – Nostalgia

1995. దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి మంచి ఫామ్ లో ఉన్నారు. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’తో డెబ్యూ చేశాక వరస హిట్లు ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్లాయి. కమెడియన్ అలీతో తీసిన ‘యమలీల’ ఏకంగా రికార్డులు సృష్టించింది. ఆ వెంటనే ‘శుభలగ్నం’ మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. దీంతో సహజంగా అగ్ర హీరోల నుంచి పిలుపు రావడం జరిగింది. అంచనాల బరువు మోయలేక బాలకృష్ణ ‘టాప్ హీరో’, నాగార్జున ‘వజ్రం’ రెండూ బాక్సాఫీస్ వద్ద టపా కట్టేశాయి. దీంతో మళ్ళీ పాత స్కూల్ కే వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. యమలీల స్ఫూర్తితో మరో ఫాంటసీ కథను సిద్ధం చేసుకుని అలీతోనే మరోసారి మేజిక్ రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యిందే ‘ఘటోత్కచుడు”.

అలీ సరసన జోడిగా రోజాను హీరోయిన్ గా ప్రకటించినప్పుడు అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా షాక్. అప్పటికే ఆవిడ టాప్ ర్యాంక్ లో ఉన్నారు. అందరితోనూ నటించేశారు. అయినా రోజా అవేవి లెక్కచేయలేదు. స్క్రిప్ట్ నచ్చేసి వెంటనే ఒప్పేసుకున్నారు. రెగ్యులర్ ట్రెండ్ కి భిన్నంగా యముడికి బదులు ఘటోత్గచుడు భూమి మీదకు వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఎస్వి కృష్ణారెడ్డి రాసుకున్న స్టోరీకి రచయిత దివాకర్ బాబు మంచి ట్రీట్ మెంట్ తో కూడిన సంభాషణలు అందించారు. ఇంత గొప్ప పాత్రకు సత్యనారాయణ తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరని అందరికీ తెలుసు. మంచి హుషారు మీదున్న ఆయన ఆనందంగా ఒప్పుకున్నారు.

సినిమా ప్రారంభంలో వచ్చే కురుక్షేత్ర యుద్ధంలో స్పెషల్ క్యామియోలలో నటించేందుకు డాక్టర్ రాజశేఖర్, శ్రీకాంత్ లాంటి అగ్ర హీరోలు ఒప్పుకోవడం అప్పట్లో సెన్సేషన్. సూపర్ స్టార్ కృష్ణతో స్పెషల్ సాంగ్ పెట్టే ఎస్వి ఈసారి ఏకంగా నాగార్జునని ఒప్పించడం మీడియాలో హై లైట్ అయ్యింది. బడ్జెట్ మంచి నీళ్లలా ఖర్చు చేశారు నిర్మాతలు అచ్చిరెడ్డి, కిషోర్ రాఠీ. రజినీకాంత్ ‘రోబో’లో చూసిన ఐశ్యర్యరాయ్ రోబోల లవ్ స్టోరీ ఇందులో నుంచి తీసుకున్నదే. 1995 మార్చి 31 విడుదలైన ఘటోత్గచుడుకి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ యమలీల అంచనాల బరువులో ఆ స్థాయికి చేరుకోలేదు. కేవలం వారం గ్యాప్ లో బాషా, అమ్మాయి కాపురం లాంటి హిట్ మూవీస్ రిలీజ్ కావడం రన్ మీద ప్రభావం చూపించింది. అయితే మ్యూజికల్ గా ఘటోత్గచుడులోనూ మంచి పాటలు ఇచ్చారు ఎస్వి

Also Read : December 91′ Releases : డ్రై మంత్ లో విజేతలు బడ్జెట్ చిత్రాలే – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి