• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » news » Yamagola Movie Analysis

Yamagola: యమలోకం సినిమాల్లో ట్రెండ్ సెట్టర్

  • By idream media Updated On - 05:44 PM, Fri - 18 August 23 IST
Yamagola: యమలోకం సినిమాల్లో ట్రెండ్ సెట్టర్

తెలుగు సినిమా చరిత్రలో యముడిని బ్యాక్ డ్రాప్ గా చేసుకుని వచ్చి అశేష బాలగోపాలాన్ని అలరించిన సినిమాల్లో అగ్ర తాంబూలం ఇవ్వాల్సి వస్తే మొదటి స్థానం అందుకునే చిత్రం యమగోల. ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళొద్దాం. 1960లో సి పుల్లయ్య ‘దేవాంతకుడు’ సినిమా రూపంలో మానవులు భయపడే యముడితో అల్లరి చేయించి గొప్ప విజయం అందుకున్నారు. మరోసారి అలాంటి ప్రయత్నం చేసే దశలో మరో కథ రాసుకున్నారు కానీ దాన్ని చేయలేకపోయారు. యమగోల టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆయన వారసుడు సిఎస్ రావు తర్వాత డిఎస్ రాజు దగ్గరకు ఆ కథ ప్రయాణం చేసింది. కానీ షూట్ కు వెళ్ళలేదు. తర్వాత దీన్ని రామానాయుడు గారు కొన్నారు కానీ ఎందుకో ఇది ఆడుతుందన్న నమ్మకం లేక మౌనం వహించారు. అలా కొన్నేళ్లు గడిచాయి.

అదే సమయంలో కెమెరామెన్ వెంకటరత్నం నిర్మాతగా సక్సెస్ కొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. మొదటి సినిమా ‘ఈతరం మనిషి’ ఫ్లాప్ అయ్యింది. ఈసారి యమగోల టైటిల్ మీద గురి కుదరటంతో నాయుడు దగ్గర హక్కులు కొనేసి డివి నరసరాజుతో ఒరిజినల్ వెర్షన్ తో సంబంధం లేకుండా కొత్త మార్పులతో వేరే స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. తాతినేని రామారావుని దర్శకుడిగా తీసుకున్నారు. ముందు హీరోగా బాలకృష్ణను అనుకున్నారు కానీ ఎన్టీఆర్ ఇంత బరువైన కథకు అబ్బాయి తూగలేడని చెప్పి తనే హీరోగా నటించేందుకు రెడీ అయ్యారు. 1977 మేలో షూటింగ్ మొదలైతే కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేయడం అప్పట్లో ఒక రికార్డు. అడవి రాముడు సిల్వర్ జూబ్లీ కోసం రెండు నెలలు ఆగి మరీ యమగోలను అవే థియేటర్లలో విడుదల చేయడం గొప్ప సంచలనం.

అలా 1977 అక్టోబర్ 21న రిలీజైన యమగోల చరిత్ర సృష్టించింది. లవకుశ, దానవీరశూరకర్ణ, అడవిరాముడు తర్వాత కోటి రూపాయలు వసూలు చేసిన సినిమాగా కొత్త రికార్డులు అందుకుంది. 28 సెంటర్లలో వంద రోజులు, 6 కేంద్రాల్లో 175 రోజులు ఆడటం విశేషం. చక్రవర్తి పాటలు తెలుగు రాష్ట్రాన్ని ఊపేశాయి. ఓలమ్మి తిక్కరేగిందా, చిలకకొట్టుడు కొడితే చిన్నదానా పాటలకు తెరమీదకు డబ్బులు విసిరేవారు. గుడివాడ యెల్లాను ఐటెం సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ మర్చిపోయేది కాదు. మిగిలిన సాంగ్స్ కూడా అంతే. ఇంద్రుడిని క్లాసు పీకుతూ లాజిక్కులతో ఎన్టీఆర్ చెప్పే డైలాగుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడైతే వివాదాలు వచ్చేవి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిందీ(లోక్ పరలోక్), తమిళం(యమునక్కు యమన్)లో రీమేక్ చేస్తే అక్కడ ఫ్లాప్ కావడం అసలు ట్విస్ట్

Also Read : Eenadu : సోషల్ మెసేజ్ తో సూపర్ స్టార్ బ్లాక్ బస్టర్ – Nostalgia

Tags  

  • jayaprada
  • Kaikala Satyanarayana
  • N. T. Rama Rao
  • Yamagola

Related News

బ్రేకింగ్‌: సినీ నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష

బ్రేకింగ్‌: సినీ నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష

అలనాటి అందాల నటి, మాజీ ఎంపీ జయప్రదకు భారీ షాక్‌ తగిలింది. కోర్టు ఆమెకు 6 నెలల జైలు శిక్ష విధించింది. జయప్రదతో పాటు మరో ముగ్గురికి కూడా జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు వెల్లడించింది. చెన్నైలోని ఎగ్మోర్‌ కోర్టు శిక్ష విధించింది. జయప్రదతో పాటు మిగతా ముగ్గురికి 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. చెన్నైలోని ఓ సినిమా థియేటర్‌కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఎగ్మోర్‌ కోర్టు ఈ శిక్ష […]

2 months ago
కైకాల – విరామమెరుగని నట నారాయణ

కైకాల – విరామమెరుగని నట నారాయణ

9 months ago
Jayaprada ఏపీ బీజేపీకి జ‌య‌ప్ర‌ద గ్లామ‌ర్

Jayaprada ఏపీ బీజేపీకి జ‌య‌ప్ర‌ద గ్లామ‌ర్

1 year ago
Moratodu : నాయుడుగారికి లక్షల నష్టం తెచ్చిన మాట

Moratodu : నాయుడుగారికి లక్షల నష్టం తెచ్చిన మాట

2 years ago
Ghatothkachudu : హీరోయిన్ ని ప్రేమించే రోబో కాన్సెప్ట్ మనదే – Nostalgia

Ghatothkachudu : హీరోయిన్ ని ప్రేమించే రోబో కాన్సెప్ట్ మనదే – Nostalgia

2 years ago

తాజా వార్తలు

  • వీడియో: స్టేజ్ పైనే గొడవపడ్డ ఇమాన్యుయేల్, యాదమ్మరాజు!
    4 hours ago
  • వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న CM కేసీఆర్.. మంత్రి KTR వెల్లడి
    4 hours ago
  • కూతురి పెళ్లి కోసం లాకర్లో దాచిన రూ.18 లక్షలకు చెదలు!
    4 hours ago
  • విజేత సూపర్ మార్కెట్ ను సీజ్ చేసిన GHMC కమిషనర్.. కారణం తెలిస్తే షాక్!
    4 hours ago
  • మూడో వన్డేలో కోహ్లీ శివతాండవం తప్పదా? రికార్డులు ఏం చెబుతున్నాయంటే?
    5 hours ago
  • జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
    5 hours ago
  • అతడు జట్టులో ఉంటే.. నేను వరల్డ్ కప్ ఆడను! బంగ్లా బోర్డుకు షకీబ్ వార్నింగ్!
    5 hours ago

సంఘటనలు వార్తలు

  • రైల్వే ట్రాక్ మీద భార్యపై బ్లేడ్ తో దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్
    6 hours ago
  • వరల్డ్ కప్ ముంగిట రోహిత్ కీలక వ్యాఖ్యలు.. మేం వాటిని పట్టించుకోం అంటూ..!
    6 hours ago
  • వైన్ షాపులు బంద్.. ఎన్ని రోజులంటే?
    6 hours ago
  • శివపార్వతులుగా ప్రభాస్, నయనతార.. లీక్ చేసిన సీనియర్ హీరోయిన్
    6 hours ago
  • గ్యాస్ స్టేషన్ లో భారీ పేలుడు.. 20 మంది సజీవదహనం!
    7 hours ago
  • రోహిత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరలవుతున్న వీడియో..
    7 hours ago
  • వండటానికి ముందు చికెన్ ను కడగొద్దు! సైంటిస్టుల స్ట్రాంగ్ వార్నింగ్..
    7 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version