iDreamPost

దేశాధ్యక్షుల్నీ , ప్రధానుల్ని వదలని కరోనా .

దేశాధ్యక్షుల్నీ , ప్రధానుల్ని వదలని కరోనా .

గంటగంటకూ విస్తరిస్తున్న కరోనా వైరస్ సామాన్యులనే కాదు , పూర్తి రక్షణ చర్యలు పాటించే దేశాధ్యక్షుల్నీ అగ్ర నేతల్ని సైతం వణికిస్తోంది . తాజాగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా సైతం తనని కలిసిన ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో స్వచ్ఛందంగా క్వారంటయిన్ లోకి వెళ్లిపోయారు . ప్రస్తుతానికి వారికి ఎటువంటి వైరస్ సోకిన లక్షణాలు లేవని ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి .

క్వారంటయిన్ లోకి వెళ్ళడానికి ముందు ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు . దేశంలో క్రమంగా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలు ఒకచోట గుమికూడడం పై పూర్తిగా నిషేధం విధిస్తూ , పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలను వివరించారు . కాగా జర్మనీలో ఇప్పటి వరకూ24873 మందికి వైరస్ సోకగా 94 మంది మరణించారని తెలిపారు .

మరో వైపు అగ్రరాజ్యం అమెరికా అధినేతనూ కరోనా ముప్పు వెంటాడుతోంది . అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని కలిసిన కొందరు అధికార ప్రతినిధులకు కరోనా వైరస్ సోకిందని తెలియడంతో ఆయన కూడా పరీక్షలు చేయించుకున్నారు . కెనెడా ప్రధాని ట్రూడో భార్యకి సైతం వైరస్ సోకడంతో ఆయన గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు . దరిమిలా పలువురు దేశాధినేతలు సైతం కరోనా పరీక్షలు చేయించుకోవడం ప్రారంభించారు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి