iDreamPost
android-app
ios-app

బొమ్మరిల్లు హాసిని మెగా రీ ఎంట్రీ ?

  • Published May 22, 2020 | 6:19 AM Updated Updated May 22, 2020 | 6:19 AM
బొమ్మరిల్లు హాసిని మెగా రీ ఎంట్రీ ?

సిద్దార్థ్ హీరోగా భాస్కర్ దర్శకత్వంలో 2006లో వచ్చిన బొమ్మరిల్లు అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ కలివిడిగా ఉండే హీరోయిన్ హాసిని పాత్రలో జెనీలియా నటన అప్పట్లో యూత్ కి మాములుగా ఎక్కలేదు. అంతేనా ఇంకేం లేవా లాంటి డైలాగులు ఎంత పాపులరయ్యాయో వేరే చెప్పనక్కర్లేదు. అంతకు ముందు బాయ్స్, సత్యం, సై లాంటి హిట్లు ఉన్నప్పటికీ ఈ సినిమా తెచ్చిన గుర్తింపు వేరే. అక్కడితోనే తను ఇంకో లెవెల్ కు వెళ్లిపోయింది. కెరీర్ ప్రారంభంలోనే అల్లు అర్జున్ తో హ్యాపీ లాంటి బంపర్ ఆఫర్లు దక్కించుకుందీ భామ.

ఆ తర్వాత ఢీ, రెడీ లాంటి బ్లాక్ బస్టర్లు వచ్చినా బొమ్మరిల్లు స్థాయిలో ఇంకేదీ ఆడలేదు. రామ్ చరణ్ తో చేసిన ఆరంజ్ తీవ్రంగా నిరాశపరిచాక తన గ్రాఫ్ టాలీవుడ్ లో డౌన్ అయిపోయింది . తను తెలుగులో ఆఖరిగా కనిపించిన చిత్రం 2012లో రానా హీరోగా నటించిన నా ఇష్టం. ఇది పెద్ద డిజాస్టర్. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కి అంకితమైపోయిన జెనిలియా త్వరలో రీ ఎంట్రీ ఇవ్వొచ్చని టాక్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సాహో సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే లూసిఫర్ రీమేక్ లో ఓ కీలకమైన పాత్రను తనతో చేయించాలనే ఆలోచనలో టీం ఉన్నట్టు సమాచారం. అయితే హీరొయిన్ గా కాదు.

మలయాళం వెర్షన్ లో మంజు వారియర్ చేసిన రోల్ కి జెనిలియా సూట్ అవుతుందనే భావనతో ఇటీవలే ఫోన్ లోనే సంప్రదింపులు జరిపారట. అంటే కథ ప్రకారం చిరంజీవికి జెనిలియా చెల్లెలు అవుతుంది. ఇందులో తనకు టీనేజ్ వయసుకు వచ్చిన అమ్మాయి కూడా ఉంటుంది. అప్పుడంటే మరీ సన్నగా ఉండేది కాని పెళ్ళయ్యాక జెనిలియాలో కొంత మార్పు వచ్చింది కాబట్టి మంచి ఆప్షన్ గానే అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఇంకా తెలియాల్సి ఉంది. స్క్రిప్ట్ ని తీర్చిదిద్డటంతో పాటు టీంని, క్యాస్టింగ్ ని సెట్ చేసుకునే పనిలో సుజిత్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఆచార్య షూటింగ్ అయ్యాక దీనికి సంబంధించిన అప్ డేట్స్ వేగమందుకుంటాయి. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet