SNP
SNP
టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌కు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ ప్రదర్శన చూసిన తర్వాత గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. గిల్ ఇలా అడితే కెరీర్‌లో ముందుకు వెళ్లడం కష్టమేనంటూ పేర్కొన్నాడు. చాలా కాలంగా గిల్ టీమిండియాలో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా గిల్ సరైన ఫామ్‌లో లేడు. వరుసగా విఫలం అవుతూ వస్తున్నాడు.
టీ20లు, వన్డేలు, టెస్టులు ఇలా మూడు ఫార్మాట్లలోనూ గిల్ ప్రస్తుతం అంత మంచి ఫామ్‌లో లేడు. మరికొన్ని వారాల్లోనే ఆసియా కప్ తర్వాత భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గిల్ ఫామ్ క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గిల్ దారుణంగా విఫలం అయ్యాడు. 32 బంతులాడి కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో గిల్ సరైన టచ్‌లో కనిపించలేదు.. భయపడుతూ ఆడుతున్నట్లు కనిపించాడు. పైగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వెంటవెంటనే తక్కువ స్కోర్లకే అవుట్ కావడం కూడా అతనిపై ఒత్తిడి పెంచింది.
ఒకవైపు వికెట్లు పడుతుండటంతో గిల్ కాస్త నిదానంగా ఆడేందుకు ప్రయత్నించాడు. అది మంచి నిర్ణయమే.. ఒక కీలక భాగస్వామ్య నిర్మించేందుకు శ్రేయస్ అయ్యర్‌తో కలిసి స్లో బ్యాటింగ్ చేశాడు. కానీ గిల్ బ్యాటింగ్ టెక్నిన్‌లో మాత్రం ఒక లోపం ఉన్నట్లు గంభీర్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ పేసర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్ బ్యాట్ అండ్ ప్యాడ్ మధ్య ఎక్కువ గ్యాప్‌ను ఉంటుందని, ఇది సరైన టెక్నిక్ కాదని, క్వాలిటీ బౌలర్లు ఈ లోపాన్ని కచ్చితంగా గుర్తిస్తారని, గిల్ దీన్ని వీలైనంత త్వరగా అధిగమించాలని గంభీర్ సూచించాడు. మరి గిల్ బ్యాటింగ్ గురించి గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘It is a technical flaw’: Gautam Gambhir points out Shubman Gill’s concerning issue #INDvsPAK #ShubmanGill #Gambhir #AsiaCup pic.twitter.com/L4PV1hO8fs
— R.Sport (@republic_sports) September 3, 2023
ఇదీ చదవండి: సిక్స్ వెళ్లిన బాల్‌తో ప్రేక్షకుడు ఏం చూశాడో చూడండి! అంపైర్లే షాక్ అయ్యారు