iDreamPost

షాకింగ్ న్యూస్.. టీమిండియా కోచ్ పదవికి ఒక్కరే దరఖాస్తు చేశారట! ఆ ఒక్కరూ..

క్రికెట్ వర్గాల్లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తాయని అంతా భావించారు. కానీ అనూహ్యంగా టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఒకే ఒక్కరు అప్లై చేశారట. ఆ వ్యక్తి ఎవరంటే?

క్రికెట్ వర్గాల్లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తాయని అంతా భావించారు. కానీ అనూహ్యంగా టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఒకే ఒక్కరు అప్లై చేశారట. ఆ వ్యక్తి ఎవరంటే?

షాకింగ్ న్యూస్.. టీమిండియా కోచ్ పదవికి ఒక్కరే దరఖాస్తు చేశారట! ఆ ఒక్కరూ..

‘టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. అర్హులు అయిన వారు అప్లై చేసుకోగలరు’ అంటూ గత నెలలో బీసీసీఐ ఓ ప్రకటన జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణకు మే 27 చివరి తేదీగా కూడా నిర్ణయించింది. దాంతో టీమిండియా హెడ్ కోచ్ పదవికి కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తాయని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ పదవికి ఆదరణ కరువైంది. అప్లై చేసుకునే దిక్కేలేదు. చివరి తేదీ ముగిసి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారన్న విషయాన్ని మాత్రం బీసీసీఐ ఇప్పటి వరకు వెల్లడించలేదు. అయితే క్రికెట్ వర్గాల్లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఒకే ఒక్కరు అప్లై చేశారట. ఆ వ్యక్తి ఎవరంటే?

టీమిండియా హెడ్ కోచ్ పదవికి 3 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి అంటూ గతంలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. సచిన్, ధోని, మోదీ, అమిత్ షా వంటి ప్రముఖుల ఫేక్ పేర్లలో కొందరు కోచ్ పదవికి అప్లే చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ న్యూస్ క్రికెట్ వర్గాలను షాక్ కు గురిచేస్తోంది. అదేంటంటే? టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఒకే ఒక్కరు అప్లై చేశారట. ఆ ఒక్కరూ ఎవరంటే? టీమిండియా మాజీ ప్లేయర్, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. అవును ఈ పదవికి గంభీర్ ఒక్కడే అప్లై చేశాడని తెలుస్తోంది. దాంతో అతడి ఎంపిక లాంఛనమే అని అందరూ అనుకుంటున్నారు.

పైగా గంభీర్ ను మంగళవారం భారత క్రికెట్ అడ్వైజరీ కమిటీ జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం. ఈ కమిటీలో అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే, సులక్షణ నాయక్‌లు ఉన్నారు. కేవలం గంభీర్ ఒక్కడే దరఖాస్తు చేయడంతో.. కోత్త కోచ్ గా అతడి ఎంపికకు తిరుగులేదని పక్కా సమాచారం. ఇదిలా ఉండగా.. కోత్త కోచ్ తో పాటుగా సెలెక్టర్ సలీల్ అంకోలా ప్లేస్ లో మరోకరిని తీసుకోనుంది. కాగా.. ఈ టీ20 వరల్డ్ కప్ తర్వాత ప్రస్తుతం హెడ్ కోచ్ గా కొనసాగుతున్న రాహుల్ ద్రవిడ్ దిగిపోనున్నాడు.

ఇక  కొత్త‌గా బాధ్యతలు అందుకునే టీమిండియా కోచ్ 2027 డిసెంబర్ 31 వరకు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే రికీ పాంటిగ్, జస్టిన్ లాంగర్, మహేళా జయవర్ధనే, స్టీఫెన్ ఫ్లెమింగ్ లాంటి దిగ్గజాల పేర్లు టీమిండియా హెడ్ కోచ్ రేసులో వినిపించినప్పటికీ.. దేశవాళీ క్రికెట్ పై లోతైన అవగాహన ఉన్నవాళ్లనే కోచ్ గా ఎంపిక చేస్తామని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా చెప్పడంతో.. విదేశీ ప్లేయర్ నే కోచ్ గా తీసుకుంటారన్న వార్తలకు చెక్ పడింది. మరి అత్యంత ప్రతిష్టాత్మకమైన టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఒకే ఒక్క దరఖాస్తు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి