SNP
SNP
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఏదో ఒక ఇంట్రస్టింగ్ కామెంట్‌తో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి. ముఖ్యంగా గంభీర్ అనగానే చాలా మంది ధోనికి యాంటీ అనుకుంటారు. అనేక సందర్భాల్లో ధోని ఒక్కడి వల్లే టీమిండియా వరల్డ్ కప్ గెలవలేదంటూ, అతనికి ఒక్కడికే వరల్డ్ కప్ గెలిచిన క్రెడిట్ దక్కిందంటూ గంభీర్ కామెంట్లు చేసేవాడు. దీంతో.. గంభీర్ అంటే ధోని వ్యతిరేకి, ధోనిని ద్వేషించే క్రికెటర్‌గా ముద్రపడిపోయింది. అయితే.. కొన్ని రోజులుగా ధోని విషయంలో గంభీర్ యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ధోని గొప్ప త్యాగమూర్తి అని, కెప్టెన్ అవ్వడం వల్ల మూడో స్థానంలో బ్యాటింగ్ చేయకుండా.. 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేసేవాడని, వన్‌డౌన్‌లో ఆడి ఉంటే.. ఎన్నో రికార్డులతో పాటు సచిన్ రికార్డులు వెనుక కోహ్లీ కాకుండా ధోని పడేవాడంటూ పేర్కొని అందర్ని షాక్‌కి గురిచేశాడు. ధోని గురించి ఇంత పాజిటివ్‌గా మాట్లాడుతోంది గంభీరేనా అనే అనుమానం కలిగించాడు.
తాజాగా మరో వ్యాఖ్యతో కూడా గంభీర్ అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ధోనిని లక్కీ కెప్టెన్‌గా పేర్కొనే గంభీర్.. ఇప్పుడు ధోని లాంటి కెప్టెన్ ఇండియన్ క్రికెట్‌లో ఇంకొడు రాడంటూ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కెప్టెన్ విషయంలో ధోనిని మించినోడు భారత క్రికెట్‌లో పుట్టడనే రేంజ్‌లో.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ధోనిలా మరో కెప్టెన్ లేడు, రాడు అంటూ ధోని ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్ తెప్పించేలా మాట్లాడాడు. గంభీర్ మాట్లాడుతూ.. “భారత క్రికెట్‌లో ఎంఎస్ ధోని కెప్టెన్సీకి ఎవరూ సాటిరారు. చాలా మంది కెప్టెన్లు వచ్చారు అలాగే చాలా మంది కెప్టెన్లు వస్తారు.. కానీ అతని కెప్టెన్సీని ఎవరూ మ్యాచ్ చేయలేరు. అతని కెప్టెన్సీలో 3 ఐసీసీ ట్రోఫీలు గెలిపించాడు. ఇంతకంటే గొప్పగా ఎవరైనా సాధిస్తారని నేను అనుకోవడం లేదు.’ అని తెలిపాడు.
గంభీర్ చెప్పినట్లు భవిష్యత్తులో ధోని కెప్టెన్సీ రికార్డులు బ్రేక్ అవుతాయో లేదో తెలియదు కానీ, ఇప్పటి వరకు కూడా ధోనినే ఇండియాస్ బెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు. గొప్ప కెప్టెన్లుగా పరిగణించడానికి ట్రోఫీలు కోలమానం కాదనుకోండి. సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీలకు కెప్టెన్లుగా వరల్డ్ కప్‌లు గెలిచిన రికార్డు లేకపోయినా.. వాళ్లిద్దరూ భారత క్రికెట్‌లో గొప్ప కెప్టెన్లే. అప్పటి పరిస్థితుల్లో టీమిండియాను వారు నడిపించిన తీరుతో వారు గొప్ప కెప్టెన్లు అయ్యారు. ఇక కప్పుల విషయానికి వస్తే.. కపిల్ దేవ్ 1983లో భారత్‌కు తొలి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్. ఆ తర్వాత టీమిండియా 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్‌లు గెలిచింది. ఆ రెండు గొప్ప విజయాలు ధోని కెప్టెన్సీలోనే వచ్చాయి. అలాగే.. 2013లో టీమిండియా ధోని కెప్టెన్సీలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. మరి ధోని కెప్టెన్సీ రికార్డుల గురించి గంభీర్ కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gambhir said “No one can match MS Dhoni’s Captaincy in Indian cricket, many captains have come & many captains will come but I don’t think anyone can match his captaincy. The man who won 3 ICC Trophies in his captaincy, I don’t think anything can be bigger than this”. [Star… pic.twitter.com/5cNMd9o3oV
— Johns. (@CricCrazyJohns) September 29, 2023
ఇదీ చదవండి: ఇండియాకు రెండు మెడల్స్ అందించిన తెలంగాణ బిడ్డ ఇషా