iDreamPost
android-app
ios-app

హాఫ్ మిలియన్ డాలర్ మార్కు దిశగా గామి

  • Published Mar 12, 2024 | 11:19 AM Updated Updated Mar 12, 2024 | 11:19 AM

యునైక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన గామి సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ లో $450,000 వసూలు చేసిన ఈ చిత్రం $500,000 చేరుకునే దిశగా అడుగులు వేస్తుంది.

యునైక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన గామి సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ లో $450,000 వసూలు చేసిన ఈ చిత్రం $500,000 చేరుకునే దిశగా అడుగులు వేస్తుంది.

హాఫ్ మిలియన్ డాలర్ మార్కు దిశగా గామి

నూతన దర్శకుడు విద్యాధర్ కాగిత దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గామి. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో చాందిని చౌదరి ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ ఎపిక్ అడ్వెంచర్ డ్రామాకి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ వసూలు చేసిన గామి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటేసింది. కాగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఒక భారీ లాండ్మార్క్ దిశగా దూసుకుపోతోంది.

యునైక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన గామి సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ లో $450,000 వసూలు చేసిన ఈ చిత్రం $500,000 చేరుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ సినిమాలో శంకర్ పాత్రలో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించారని అందరి చేతా ప్రశంసలు అందుకున్నారు. సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ… తక్కువ బడ్జెట్ లోనే అద్భుతమైన విజువల్స్ ను, ఆకట్టుకునే డ్రామాను తెరకెక్కించిన దర్శకుడు విద్యాధర్ కాగితను అందరూ మెచ్చుకున్నారు. ముఖ్యంగా హిమాలయ పర్వతాల బ్యాక్ డ్రాప్ ఉన్న సన్నివేశాలను అద్భుతంగా తీశారని ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. కాగా ఈ దర్శకుడి రెండో సినిమా కోసం ఇప్పటి నుంచే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఇక హీరో విశ్వక్ సేన్ విషయానికి వస్తే… గామి సినిమాతో తన కెరీర్ బెస్ట్ హిట్ ను అందుకున్నారు. ఆరేళ్ల కెరీర్ లో వీలయినన్ని విభిన్న పాత్రలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు ఈ యువ హీరో. ముఖ్యంగా గామి సినిమాకి శారీరకంగా ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు కలెక్షన్ల రూపంలో వచ్చింది. ప్రస్తుతం యూఎస్ లో హాఫ్ మిలియన్ డాలర్ మార్కు దిశగా దూసుకుపోతున్న గామి… రాబోయే రోజుల్లో ఇంకెన్ని వసూళ్లు రాబడుతోందో చూడాలి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetHepyek girişmeritbetCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Girişmeritbet