iDreamPost

Budget Sedan Car: రూ.6.50 లక్షల్లో అదిరిపోయే సెడాన్.. హ్యూండాయ్ నుంచి..

అందరూ హ్యాచ్ బ్యాక్ కార్లు కొనాలి అనుకుంటారు. కానీ, సెడాన్ జోలికిపోరు. ఎందుకంటే ధర ఎక్కువని. ఇప్పుడు మీకోసం బడ్జెట్ లో సెడాన్ కారును తీసుకొచ్చాం. దాని పూర్తి వివరాలు..

అందరూ హ్యాచ్ బ్యాక్ కార్లు కొనాలి అనుకుంటారు. కానీ, సెడాన్ జోలికిపోరు. ఎందుకంటే ధర ఎక్కువని. ఇప్పుడు మీకోసం బడ్జెట్ లో సెడాన్ కారును తీసుకొచ్చాం. దాని పూర్తి వివరాలు..

Budget Sedan Car: రూ.6.50 లక్షల్లో అదిరిపోయే సెడాన్.. హ్యూండాయ్ నుంచి..

కారు అననగానే చాలా మంది హ్యాచ్ బ్యాక్ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. కానీ, ఎక్కువగా దూర ప్రయాణం చేసేవాళ్లు, లగేజ్ ఎక్కువ వెంట తీసుకెళ్లే వారికి మాత్రం సెడాన్ కారు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే హ్యాచ్ బ్యాక్ లతో పోలిస్తే.. సెడాన్ కారు ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయనే చెప్పాలి. అందుకే చాలా మంది హ్యాచ్ బ్యాక్ లు కొనుగోలు చేయాలి అనుకుంటారు. కానీ, ఇప్పుడు బడ్జెట్ ధరలోనే ఒక మంచి సెడాన్ కారు మార్కెట్ లో అందుబాటులో ఉంది. అది కూడా హ్యూండాయ్ లాంటి ట్రస్టెడ్ కంపెనీ నుంచి ఈ సెడాన్ కారు అయితే అవైలబుల్ గా ఉంది. మరి.. ఆ కారు ధర ఎంత? దాని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటి? అనే వివరాలు చూద్దాం.

 హ్యూండాయ్ కంపెనీ కార్లకు ఇండియన్ మార్కెట్ లో చాలా మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికీ వెర్నా, ఐ10, ఐ20 వంటి మోడల్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతూ ఉంటాయి. హ్యూండాయ్ కంపెనీ కార్లకు రీసేల్ వ్యాల్యూ కూడా బాగానే ఉంటుంది. అందుకే ఈ కంపెనీ కార్లను కొనుగోలు చేసేందుకు మిడిల్ క్లాస్ వాళ్లు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి హ్యూండాయ్ కంపెనీ నుంచి వచ్చిన సూపర్ సెడాన్ ఆరా కారుకు చాలా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో హ్యూడాయ్ ఆరా కార్లు సందడి చేస్తున్నాయి. ఈ కారులో మొత్తం E, S, SX, SX(O), SX+ అనే 5 వేరియంట్స్ ఉన్నాయి. ఈ కారులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ కూడా ఉన్నాయి.

హ్యూండాయ్ ఆరాలో ఫ్యూయల్ పంగా.. పెట్రోల్- సీఎన్జీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆరా బేసిక్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.44 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ ఎండ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.9 లక్షలుగా ఉంది. మీరు వేరియంట్ మార్చే కొద్దీ కారు ధర అనేది మారుతూ ఉంటుంది. అలాగే ఎక్స్ షోరూమ్ ధరకు ఆన్ రోడ్ ధరకు వేరియేషన్ ఉంటుంది. ట్యాక్సులు, ఇన్సూరెన్స్, ఆర్టీవో ఛార్జెస్ అన్నీ కలుపుకుని రూ.60 వేల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇంక ఈ ఆరా ఇంజిన్ విషయానికి వస్తే.. 1197 సీసీ పవర్ ఫుల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. అలాగే ఈ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కి ఫ్యాక్టరీ అవుట్ లెట్ లోనే సీఎన్జీ కిట్ తో వస్తోంది. ఇది 83 పీఎస్/114ఎన్ఎం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంక ఫీచర్స్ విషయానికి వస్తే.. 8 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో వస్తోంది. ఆండ్రాయిడ్ ఆటో- యాపిల్ కార్ ప్లే ఉంటుంది. వైర్ లెస్ ఫోన్ ఛార్జర్ కూడా ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్ మెంట్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

సేఫ్టీ విషయానికి వస్తే.. ఇది 6 ఎయిర్ బ్యాగ్స్ తో వస్తోంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, రేర్ పార్కింగ్ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సార్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ హ్యూండాయ్ ఆరా కారుకి గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ ల 5 స్టార్స్ కి 2 స్టార్స్ దక్కాయి. అంటే సేఫ్టీ పరంగా మరీ తీసేయదగ్గ కారేం కాదు. మీకు, మీ కుటుంబానికి కాస్త భద్రమైన కారు అనే చెప్పాలి. ఇంక ఈ హ్యూండాయ్ ఆరా కారు మొత్తం 6 కలర్స్ లో అందుబాటులో ఉంది. ఫైరీ రెడ్, టైఫూన్ సిల్వర్, స్టారీ నైట్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, ఆక్వా టీల్ అనే కలర్స్ లో లభిస్తోంది. ఇంక ఈ కారు మారుతీ సుజుకీ బ్రెజా, హోండా అమేజ్, టాటా టీగోర్ కార్లకు పోటీని ఇస్తోంది. మరి.. ఈ హ్యూడాయ్ ఆరా కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి