iDreamPost
android-app
ios-app

హార్దిక్ పాండ్యా దేశం కోసం ఆడేవాడు కాదు.. అతడికి డబ్బే ముఖ్యం: భారత మాజీ క్రికెటర్

  • Published Mar 13, 2024 | 9:26 AM Updated Updated Mar 13, 2024 | 2:53 PM

హార్దిక్ పాండ్యాకు దేశం కంటే ఐపీఎల్, డబ్బే ముఖ్యమని తీవ్ర ఆరోపణలు చేశాడు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యాకు దేశం కంటే ఐపీఎల్, డబ్బే ముఖ్యమని తీవ్ర ఆరోపణలు చేశాడు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యా దేశం కోసం ఆడేవాడు కాదు.. అతడికి డబ్బే ముఖ్యం: భారత మాజీ క్రికెటర్

వన్డే వరల్డ్ కప్ 2023 మెగాటోర్నీలో హార్దిక్ పాండ్యా కాలికి గాయమైన విషయం తెలిసిందే. ఇక ఈ గాయానికి సర్జరీ చేయించుకుని, దాదాపు ఆటకు కొన్ని నెలల పాటు దూరంగా ఉన్నాడు. అయితే గాయం నుంచి కోలుకున్న పాండ్యా ఇటీవలే డొమెస్టిక్ టోర్నీ అయిన డీవై పాటిల్ టోర్నమెంట్ లో పాల్గొన్నాడు. ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి.. తర్వాత కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ కోసం ప్రాక్టీస్ మెుదలుపెట్టాడు. ప్రాక్టీస్ లో భారీ షాట్లతో విరుచుకుపడుతున్న వీడియో నెట్టిట వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో పాండ్యాపై భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు భారత మాజీ ఆటగాడు ప్రవీణ్ కుమార్. “ఐపీఎల్ కు రెండు నెలల ముందు హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. ఇప్పుడు అతడు పూర్తిగా కోలుకున్నాడు. కానీ పాండ్యా దేశం కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆడలేదు. రాష్ట్రం కోసం దేశవాళీ టోర్నీలో కూడా ఆడలేదు. అతడు ఎక్కువగా ఐపీఎల్ ఆడటానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దేశం కన్నా పాండ్యాకి డబ్బు, ఐపీఎల్ టోర్నీనే ముఖ్యంలా కనిపిస్తోంది. మనీ సంపాదించడంలో తప్పులేదు. కానీ కేవలం డబ్బుకోసం దేశాన్ని, రాష్ట్రాన్ని వదిలేయడం కరెక్ట్ కాదు” అంటూ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కూడా మాట్లాడాడు. రోహిత్ మరో మూడు సంవత్సరాలు కెప్టెన్సీ చేయగలడని, అయితే ఆ విషయం మేనేజ్ మెంట్ చేతుల్లో ఉందని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. కాగా.. గత కొన్ని రోజులుగా ప్రవీణ్ కుమార్ ఇతర ఆటగాళ్లపై సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇతడు చేసిన హాట్ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి పాండ్యాకు దేశం కంటే ఐపీఎల్, డబ్బే ముఖ్యమన్న భారత మాజీ ఆటగాడి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.



ఇదికూడా చదవండి: CAAను సమర్ధించిన పాకిస్తానీ క్రికెటర్.. వైరలవుతున్న ట్వీట్!