ఏపీలో విషాదం చోటు చేసుకుంది. వినాయక చవితి పండగ రోజు మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు అనారోగ్యంతో సోమవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన బంధువులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. అసలేం జరిగిందంటే? మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై విశాఖలోని ఆ ఆస్పత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమించడంతో ఆయన సోమవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇదే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం చినగుమ్మలూరుకు చెందిన కాకర నూకరాజు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. పాయకరావుపేట నుంచి 1985,1989,1994లో టీడీపీ నుంచి పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు. ఇక మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు లేడన్న వార్త తెలియడంతో రాజకీయ ప్రముఖులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ నేతలు స్పందించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. ప్రస్తుతం బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబు చుట్టూ వివిధ కేసులు వరుసలో ఉన్నాయి. ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్, అసైన్డ్ భూముల కుంభకోణం వంటి కేసులు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ఇలా ఏపీలోని కేసులతోనే చంద్రబాబు ఇబ్బందులు […]