iDreamPost
android-app
ios-app

IND vs ENG: KS భరత్ నే ఆడించాలి.. ఆ ప్లేయర్ వద్దు! మాజీ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్

  • Published Feb 13, 2024 | 6:33 PM Updated Updated Feb 13, 2024 | 6:33 PM

వరుసగా విఫలం అవుతున్న తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కు అండగా నిలబడ్డాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఇంగ్లాండ్ తో జరగబోయే మూడో టెస్ట్ లో భరత్ నే ఆడించాలని, ఆ ప్లేయర్ వద్దని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

వరుసగా విఫలం అవుతున్న తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కు అండగా నిలబడ్డాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఇంగ్లాండ్ తో జరగబోయే మూడో టెస్ట్ లో భరత్ నే ఆడించాలని, ఆ ప్లేయర్ వద్దని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

IND vs ENG: KS భరత్ నే ఆడించాలి.. ఆ ప్లేయర్ వద్దు! మాజీ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్

KS భరత్.. గత కొంతకాలంగా టీమిండియాలో కంటిన్యూస్ గా అవకాశాలు వస్తున్నాగానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో 69 పరుగులు చేసి టాచ్ లోకి వచ్చినట్లుగానే కనిపించాడు. కానీ తన సొంతమైదానం విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్ట్ లో దారుణంగా విఫలం అయ్యాడు. వరుసగా విఫలం అవుతున్న అతడిని తప్పించి.. మరో ప్లేయర్ కు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు కుర్రాడికి అండగా నిలబడ్డాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఇంగ్లాండ్ తో జరగబోయే మూడో టెస్ట్ లో కేఎస్ భరత్ నే ఆడించాలని పేర్కొన్నాడు.

వరుసగా విఫలం అవుతున్న టీమిండియా వికెట్ కీపర్, తెలుగు ప్లేయర్ కేఎస్ భరత్ ను మూడో టెస్ట్ నుంచి తప్పించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అతడి ప్లేస్ లో యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ ను తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇక వార్తలపై స్పందించాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. కేఎస్ భరత్ కు మద్దతుగా నిలిచాడు. “నేను కొన్ని వార్తలు విన్నాను. అయితే నా అభిప్రాయం ప్రకారం మూడో టెస్ట్ లో వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ నే కొనసాగించడం మంచింది. ఎందుకంటే? ప్రస్తుతం జరిగింది రెండే టెస్టులు. పైగా అతడు కీపింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. మీరు కేవలం అతడి బ్యాటింగ్ వైఫల్యాన్నే భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. భరత్ ను స్పెషలిస్టు కీపర్ గానే చూడాలి. ఒకవేళ బ్యాటర్ గానే అతడిని మీరు చూడాలనుకుంటే.. మరొక్క మ్యాచ్ లో అవకాశం కల్పించాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.” అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా.. పిచ్ లు కఠినంగా ఉండటంతో.. రెగ్యూలర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ను కేవలం బ్యాటర్ గానే ఆడిస్తున్నారని ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ గుర్తుచేశాడు. కాగా సౌతాఫ్రికా టూర్ నుంచి మానసిక ఒత్తిడి కారణంగా వైదొలిగాడు యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. దీంతో కేఎస్ భరత్ కు లక్కీ ఛాన్స్ దక్కింది. రాహుల్ ను బ్యాటర్ గా భావించడంతో.. భరత్ కు మంచి అవకాశం దొరికింది. అయితే ఈ ఛాన్స్ ను వినియోగించుకోవడంలో అతడు పూర్తిగా విఫలం అవుతున్నాడు. సొంత గ్రౌండ్ విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి కేవలం 23 పరుగులు మాత్రమే చేసి.. తీవ్ర నిరాశపరిచాడు. దీంతో అతడి ప్లేస్ లో యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి. అయితే రాజ్ కోట్ టెస్ట్ లో భరత్ ను ఆడించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఇషాన్ కిషన్ VS రాహుల్ ద్రావిడ్! గట్టి వార్నింగ్ తో ఓ మెయిల్ వెళ్లిందట!